Asianet News TeluguAsianet News Telugu

విష్ణు విజయానికి... ప్రకాశ్‌రాజ్ ఓటమికి కారణం అదే, నేనెప్పుడో చెప్పా: ‘‘మా’’ ఫలితాలపై సోమిరెడ్డి వ్యాఖ్యలు

'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandra mohan reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

tdp leader somireddy chandramohan reddy sensational comments on maa elections
Author
Hyderabad, First Published Oct 10, 2021, 10:34 PM IST

'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandra mohan reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం అవుతుందని తాను కొద్దిరోజుల కిందట మిత్రులతో చెప్పానని సోమిరెడ్డి స్పష్టం చేశారు. సీనియర్ల ఆశీస్సులు తనకు అక్కర్లేదని ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ప్రకాశ్‌రాజ్ తన ఓటమికి తానే బాటలు వేసుకున్నాడని పేర్కొన్నారు.

ఇక, మంచు విష్ణు వినయవిధేయతలే ఆయన విజయానికి నాంది అవుతాయని కూడా తాను చెప్పానని సోమిరెడ్డి వెల్లడించారు. ఈ రోజు అదే నిజమైందని ఆయన తెలిపారు. అలాగే విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. విష్ణుకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ALso Read:MAA elections:మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!

కాగా, మా యుద్ధంలో మంచు విష్ణుదే (manchu vishnu) తుది విజయం అయ్యింది. ఆయన ఏకపక్ష విజయం సాధించారు. మంచు విష్ణు ఏకంగా 400 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అధికార ప్రకటన మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ప్రకాష్ రాజ్ (prakash raj) పై మంచు విష్ణు గెలుపొందారని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ (postal ballot) ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యం చూపించగా, జనరల్ బ్యాలెట్ లో కూడా మంచు విష్ణు జోరు చూపించారట.

మంచు ప్యానెల్ నుండి కీలకమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు రఘుబాబు (raghu babu), శివబాలాజీ (shiva balaji) దక్కించుకుంటున్నారు. అదే ప్యానెల్ నుండి మాదాల రవి (madala ravi), పృథ్వి (prudhvi) కూడా ఆధిక్యంలో ఉన్నారని సమాచారం. అయితే ఎగ్జిక్యుటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన బాబు మోహన్ (babu mohan) ఓటమిపాలయ్యారు. ఆయనపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన శ్రీకాంత్ (srikanth) 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనితో ఎప్పటిలాగే మా కమిటీ ఇరు ప్యానెల్ సభ్యులతో మిక్స్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios