పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విష్ణుకు కలిసి వచ్చినట్లు తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు దూసుకుపోయారు. దాదాపు మంచు విష్ణు విజయం ఖాయమే అంటున్నారు.
అనుకున్న విధంగానే ఫలితాలు వస్తున్నాయి. మొదట్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూకుడు చూపించినా, మరలా రేస్ లో వెనుకబడినట్లు తెలుస్తుంది. కీలకైన అధ్యక్ష పదవికి సంబంధించి కౌంటింగ్ మొదలు కాగా మంచు విష్ణు లీడ్ లో ఉన్నట్లు సమాచారం. ఆరు వందలకు పైగా ఓట్లు నమోదు కాగా, మంచు విష్ణు స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విష్ణుకు కలిసి వచ్చినట్లు తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు దూసుకుపోయారు. దాదాపు మంచు విష్ణు విజయం ఖాయమే అంటున్నారు. ఇప్పటికే కీలకమైన రెండు పదవులు మంచు విష్ణు ప్యానెల్ వశమయ్యాయి. జనరల్ సెక్రెటరీ, ట్రెజరరీ పదవులు మంచు ప్యానెల్ నుండి పోటీ చేసిన సభ్యులు గెలుపొందారు.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి బాబు మోహన్ పై శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి జనరల్ సెక్రెటరీగా పోటీ చేసిన జీవిత ఓటమిపాలయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి అదే పదవికి పోటీ పడ్డ రఘుబాబు విజయం సాధించారు. మా కమిటీ మెంబర్స్ లో ప్రధానమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోల్పోయింది. ట్రెజరర్ గా శివబాలాజీ గెలుపొందారు. ప్రస్తుత మా జనరల్ సెక్రెటరీగా జీవిత ఉండగా.. ఆమె ఆ పదవి కోల్పోయారు.
ట్రెజరర్ గా పోటీ చేసిన శివబాలాజీ గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ పడిన నాగినీడుపై శివబాలాజీ గెలుపొందడం జరిగింది. కీలకమైన మా కార్యనిర్వాహక వర్గంలో ట్రెజరర్ ఒకటి కాగా, బాలాజీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్న గత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో శివబాలాజీ ట్రెజరర్ గా ఉన్నారు. మరోమారు వరుసగా ఆయన ఈ పదవిని చేపట్టారు. దీనితో మరో రెండేళ్లు మా లో శివబాలాజీ ట్రెజరర్ గా ఉండనున్నారు.
