Asianet News Telugu

'మా' ఎలక్షన్స్: మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం ... ప్రకాష్ రాజ్ కి మంచు విష్ణు ఇన్ డైరెక్ట్ పంచ్!

ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో మంచు విష్ణు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులను, ఓటర్లను ఉద్దేశిస్తూ మంచు విష్ణు ఓ లేఖ విడుదల చేశారు. 
 

maa elections manchu vishnu conforms his nomination releases a letter ksr
Author
Hyderabad, First Published Jun 27, 2021, 12:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఎన్నికలు సమీపిస్తున్న వేళ టాలీవుడ్ లో నటుల మధ్య వాదప్రతివాదనలు, కౌంటర్స్, ఎన్కౌంటర్స్ చోటు చేసుకుంటున్నాయి. నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించడంతో పాటు ప్రస్తుత కమిటీ సభ్యుల పనితీరు సరిగాలేదన్నారు. అలాగే నాగబాబు గత నాలుగేళ్లుగా 'మా' ప్రతిష్ట మసకబారిందని ఆరోపణలు చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్, నాగబాబు వ్యాఖ్యలు ఖండిస్తూ నిన్న నటుడు నరేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 


కాగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో మంచు విష్ణు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులను, ఓటర్లను ఉద్దేశిస్తూ మంచు విష్ణు ఓ లేఖ విడుదల చేశారు. 


ఆ లేఖలో మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు ధృవీకరించిన మంచు విష్ణు సినిమా పరిశ్రమతో తనకు ఎనలేని అనుబంధం ఉందని తెలియజేశారు. పరిశ్రమ కష్ట నష్టాలు చూస్తూ పెరిగాను అన్న మంచు విష్ణు, 'మా' కుటుంబ సభ్యులు భావాలూ, బాధలు తెలుసు అంటూ లేఖలో తెలియజేశారు. 


మా కుటుంబానికి కీర్తి ప్రసాదించిన సినిమా పరిశ్రమ ఋణం తీర్చుకోవడం బాధ్యతగా భావిస్తాను అన్నారు. గతంలో నాన్న మోహన్ బాబు 'మా' అధ్యక్షుడిగా పనిచేశారని,  ఆయన సేవలు, అనుభవాలు, నాయకత్వ లక్షణాలు తనకు మార్గదర్శకాలు అని లేఖలో పొందుపరిచారు. 


గతంలో 'మా' ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవంతో 'మా'సభ్యుల బాధలు తీర్చడానికి పాటుపడతాను. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం... అంటూ వివరించారు. మంచు విష్ణు లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


లేఖ చివర్లో అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉంటాను అనడం, మన ఇంటిని మనమే చక్కదిద్దుకున్నాం.. అనడం ద్వారా ప్రకాష్ రాజ్ ని మంచు విష్ణు టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద తలకాయలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రకాష్ రాజ్ ని ఎదిరించాలంటే.. నాన్ లోకల్ కార్డు ఒక్కటే మార్గం అని ప్రత్యర్ధులు భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios