Asianet News TeluguAsianet News Telugu

విష్ణు మోహన్ బాబు కొడుకు కావడం వలనే.. చిరంజీవి వర్సస్ మోహన్ బాబుగా మా ఎన్నికలను చూస్తున్నారు

మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన సభ్యులు నామినేషన్స్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడం జరిగింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపు నుండి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

maa elections contestant jeevitha rajashekar made some interesting comments
Author
Hyderabad, First Published Sep 27, 2021, 1:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 మా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా నేటి నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన సభ్యులు నామినేషన్స్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడం జరిగింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపు నుండి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఎన్నికలో నేను ప్రలోభాలకు పాల్పడుతున్నానని, ఓటర్లను మభ్య పెట్టడం, తనకు అనుకూలమైన కొందరు సీరియల్ నటులకు కొత్తగా ఓట్లు పుట్టించడం వంటివి చేస్తున్నానంటూ నటుడు పృథ్విరాజ్ చేసిన ఆరోపణలు బాధించాయి అన్నారు. ఇది మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ. ఎవరో ఒకరు గెలవాలి, ఒక పదవిని ఒకరే నిర్వర్తించాలి, అందుకే ఈ ఎన్నికలు. కనుక మా సభ్యులు అందరూ ఒకటే అన్నారు. 


గెలిచినా ఓడిపోయినా మా అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేస్తాము. ఎటువంటి వివాదాలు, ఆరోపణలకు తావు లేకుండా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న మంచు విష్ణు మోహన్ బాబు కుమారుడు కావడంతో ఎన్నికలు చిరంజీవి వర్సస్ మోహన్ బాబు అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. నిజానికి చిరంజీవి అందరివాడని జీవితా స్పష్టం చేశారు. 


గత రెండేళ్ల పదవీ కాలంలో జనరల్ సెక్రెటరీగా గొప్పగా పనిచేశానన్న నమ్మకం ఉంది. మా సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మరలా విజయం సాధిస్తానని, మా సభ్యులు ఓట్లు వేసి గెలిపిస్తారని నమ్మకం ఉందని జీవితా రాజశేఖర్ మీడియాతో తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios