ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వరకు నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానెల్ ల మధ్య వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. నరేష్ ప్యానెల్ ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం పెట్టుకుంది. అయితే శివాజీరాజ మాత్రం తమకు మార్చి 31వరకు గడువు ఉందని, అది కాదని ముందుకు వెళితే కోర్టుకి వెళ్తామని అంటున్నట్లు నరేష్ మీడియా ముందు వెల్లడించారు.

అంతేకాదు పెండింగ్ లో ఉన్న చెక్కులపై సంతకాలు పెట్టడానికి కూడా పూర్వ సభ్యులు సహకరించడం లేదని అన్నారు. తనకు కుర్చీ పిచ్చి లేదని చెప్పిన నరేష్, చట్టపరంగా ఎన్నికల్లో గెలిచినా తరువాత ఎప్పుడైనా బాధ్యతలు స్వీకరించే హక్కు తమకు ఉంటుందని.. పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.