Asianet News TeluguAsianet News Telugu

మహేష్ ని కామెంట్స్ చేస్తాడా..? నడిఘర్ సంఘానికి 'మా' లేఖ!

తమిళంలో స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు మనోజ్ పై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ కామెంట్లు విని షాక్ అయ్యారు. 

maa association letter to nadigar sangam
Author
Hyderabad, First Published Sep 15, 2018, 3:18 PM IST

తమిళంలో స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు మనోజ్ పై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ కామెంట్లు విని షాక్ అయ్యారు.

ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలకు దారి తీసింది. ఈ విషయంపై తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా).. నడిఘర్ సంఘానికి లేఖ రాసింది. మహేష్ బాబుపై కామెంట్స్ చేసిన సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వ్యాఖ్యలు షాక్ కి గురి చేశాయని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు 'మా' వెల్లడించింది.

మద్రాస్ లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఉన్నప్పటి నుండి స్నేహపూర్వకంగా వాతావరణంతో మెలుగుతున్నామని ఇలాంటి సమయంలో సదరు కమెడియన్ మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానులతో పాటు, సినీ పెద్దలకు కూడా ఆగ్రహాన్ని తెప్పించాయంటూ వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు.. 

మహేష్ బాబు ఓ బండరాయి.. ముఖంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు.. స్టాండప్ కమెడియన్ కామెంట్స్!

క్షమాపణలు చెప్పినా.. మహేష్ ఫ్యాన్స్ విడిచిపెట్టడం లేదు!

Follow Us:
Download App:
  • android
  • ios