వాలెంటైన్స్ డే  సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ రోమాంటిక్ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. సాంగ్ ఇంత హిట్ కావడం పట్ల లిరిసిస్ట్ ‘అనంత శ్రీరామ్’ స్పందించారు.  సాంగ్ వెనక పడ్డ కష్టాన్ని తెలిపారు.   

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ వీడియోను మేకర్స్ నిన్న తాజాగా రిలీజ్ చేశారు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లి ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన్ ఈ సాంగ్ ప్రేమికులు, మ్యూజిక్ లవర్స్ కూడా బాగా నచ్చింది. సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటలు గడవకుండానే భారీ స్థాయిలో రెస్పాన్స్ తో ఆల్ టైం ఆల్ టైం టాప్ 12 మిలియన్ వ్యూస్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వచ్చింది. 

 దీని బట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి అలాగే ఈ సాంగ్ ఇంత పెద్ద సక్సెస్ కావడంతో సంగీత దర్శకుడు థమన్ (Thaman) కూడా ఒకింత ఎమోషనల్ అవుతున్నాడు. మొత్తానికి అయితే ఈ సాంగ్ తో మహేష్ ఫ్యాన్స్ సహా మ్యూజిక్ లవర్స్ కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కాగా సాంగ్ హిట్ కావడాన్ని లిరిసిస్ట్ ‘అనంత శ్రీరామ్’(Anata Sriram) కూడా ఎంజాయ్ చేస్తూ స్పందించారు. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సాంగ్ వెనకాల ఎంతమంది కష్టం ఉందో తెలిపారు. 

Scroll to load tweet…

లిరిక్స్ పరంగా అనంత్ శ్రీ రామ్ ఒక్కో పల్లవి, చరణం కోసం పది నుంచి 12 సార్లు రాయాల్సి వచ్చేదని తెలిపాడు. వాటి నుంచి వెలికి తీయగా ఇంత మంచి లిరిక్స్ బయటికి వచ్చాయని తెలిపారు. మరోవైపు లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్, స్టార్ సింగర్ ‘సిద్ద్ శ్రీరామ్’ (Sid Sriram) గాత్రం తోడవటం, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్యాచీ ట్యూన్ అందించడం మంచి ఫలితాలు తెచ్చిపెట్టిందన్నారు. 

అయితే గతంలోనూ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘గీతా గోవిందం’ సినిమా నుంచి విడుదలైన ‘ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్ కూడా హిట్ అయ్యింది. కాగా ఈ చిత్రానికి కూడా సర్కారు వారి పాటకు పనిచేస్తున్న డైరెక్టర్ పరుశురామ్ పెట్ల, అనంత శ్రీరామ్, సింగర్ సిద్ధ్ శ్రీ రామ్ పనిచేశారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా ఈ ముగ్గురు ‘రామ్’లు కలిసి పనిచేయడం వల్లే మంచి ఫలితం వచ్చిందని, మరోవైపు థమన్ కూడా మంచి మ్యూజిక్ అందించడం పాటకు మరింత బలాన్ని చేకూర్చాయని తెలిపారు. ఏదేమైనా మహేశ్ బాబు ఫ్యాన్స్ ట్రెండీ సాంగ్ ‘కళావతి’ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు హిట్ వైబ్స్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో మహేశ్ బాబు, థమన్ కలిసి ఉన్న మీమ్స్ ను పోస్ట్ చేస్తున్నారు.