Asianet News TeluguAsianet News Telugu

పాటని ఫస్ట్ తన భార్యకే వినిపిస్తానంటోన్న లిరిక్‌ రైటర్‌ శ్రీమణి.. `రంగ్‌దే` కథేంటో చెప్పేశాడు!

 లిరిక్‌ రైటర్‌ శ్రీమణి మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. చిత్ర కథ గురించి రివీల్‌ చేశాడు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మ‌ధ్య ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని కాంటెంప‌రరీగా ఈ సినిమాలో వెంకీ చూపించారని చెప్పారు.

lyric writer srimani interview about rang de movie arj
Author
Hyderabad, First Published Mar 18, 2021, 9:14 PM IST

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా ప్రస్తుతం `రంగ్‌దే` చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ ఆకట్టుకుంది. రేపు(శుక్రవారం) సాయంత్రం ట్రైలర్‌ విడుదల కాబోతుంది. కర్నూల్‌లో ఓ ఈవెంట్‌గా దీన్ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. 

తాజాగా ఈ చిత్ర లిరిక్‌ రైటర్‌ శ్రీమణి మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. చిత్ర కథ గురించి రివీల్‌ చేశాడు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మ‌ధ్య ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని కాంటెంప‌రరీగా ఈ సినిమాలో వెంకీ చూపించారని చెప్పారు. ఆ ఎమోష‌న్సే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లమని, యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. `తొలిప్రేమ' నుంచే డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరితో క‌లిసి ప‌నిచేస్తున్నాను. గేయ‌ర‌చ‌యిత‌కు చాలా స్వేచ్ఛ‌నిస్తారు. ఒక గిరి గీసుకొని అందులోనే ఉండ‌రు. దాంతో లిరిక్స్ బాగా రావ‌డానికి ఆస్కారం ఉంటుంది. ఆయ‌న పాట కోసం మంచి సంద‌ర్భాల‌ను సృష్టిస్తారు. 'రంగ్ దే' మూవీలో అన్ని పాట‌ల‌కూ మంచి సంద‌ర్భాలు కుదిరాయన్నారు. 

ఏదైనా ఒక ఆల్బమ్‌ లో పాటలు  ఒక‌దానికొక‌టి భిన్నంగా అనిపించే పాట‌లు ఉండ‌టం అరుదుగా జ‌రుగుతుంటుంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ గారు ఆల్బ‌మ్‌లోని పాట‌ల్ని డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. 'రంగ్ దే' ఆల్బ‌మ్ అలాంటిదే. నాలుగు పాట‌లు నాలుగు ర‌కాలుగా ఉండి అల‌రిస్తున్నాయన్నారు.  తాను ప్రతి పాట‌నూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటానని చెప్పాడు. `సాధార‌ణంగా నేను ఓ పాట రాస్తే మొద‌ట నా భార్య‌కు లేదంటే నా ఫ్రెండ్ ముర‌ళికి, రైట‌ర్ తోట శ్రీ‌నివాస్‌కు వినిపిస్తుంటా. దేవిగారి మ్యూజిక్‌కు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఆయ‌న‌తో నా పాట షేర్ చేసుకొని, ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫిలసాఫిక‌ల్ సాంగ్స్ రాసిన‌ప్పుడు గురువుగారు సీతారామ‌శాస్త్రి గారికి వినిపించి, ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకుంటుంటా` అని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios