మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ముందుగా ఈ సినిమాను 70 నుంచి 80 కోట్ల మధ్యలో నిర్మించాలని చరణ్ అనుకున్నాడు. కానీ భారీ స్థాయిలో క్వాలిటీగా గ్రాఫిక్స్ చేయించవలసి ఉండటంతో, బడ్జెట్ ను 125 కోట్లకి పెంచారు.

 

ఖర్చు పెరగడం వలన మరో భాగస్వామి వుంటే బాగుంటుందని భావించి, లైకా ప్రొడక్షన్స్  వారిని సంప్రదిస్తున్నారట. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి కూడా వాళ్లు పెట్టుబడి పెట్టారు కనుక, ఈ సినిమా నిర్మాణ భాగస్వాములుగా ఉండటానికి వాళ్లు అంగీకరించే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. చిరూ పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.