భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కు ప్రముఖ నిర్మాణ సంస్ద లైకా ప్రొడక్షన్స్ లీగల్ నోటీస్ పంపినట్లు సమాచారం. అందుకు కారణం భారతీయడు 2 చిత్రం విషయంలో వచ్చిన విభేధాలే అని తెలుస్తోంది. ఎందుకనో మొదటనుంచీ భారతీయుడు 2 కు సమస్యలు వెంటాడుతున్నాయి. రోబో 2 చిత్రం నిర్మించిన ఇదే బ్యానర్ ...భారతీయుడు 2 విషయంలో బడ్జెట్ ని కంట్రోలు చేయాలనుకోవటమే సమస్యలు తెచ్చిపెట్టిందని తమిళ సినీ వర్గాల సమాచారం. 

వాస్తవానికి రజనీతో రోబో 2 చిత్రం చేస్తున్నప్పుడే శంకర్ ..భారతీయుడు 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు. అయితే మేకప్ నుంచి బడ్జెట్ దాకా రకరకాల కారణాలతో ప్రాజెక్టు లేటు అవుతూండటంతో సినిమా ఆగిపోయిందని వార్తలు మొదలయ్యాయి. శంకర్ గతంలోలాగ ఓ కమిట్మెంట్ తో పనిచేయటం లేదని, బడ్జెట్ ని ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నాడని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

మరో ప్రక్క కమల్ హాసన్ తన రాజకీయాల జీవితంలో బిజీగా ఉన్నారు. ఇవన్ని ఒకెత్తు అయితే రిలియన్స్ వారు ఈ ప్రాజెక్టుని టేకోవర్ చేసారని వార్తలు గుప్పుమనటం ఓ సమస్య. 
అయితే ఇవన్నీ రూమర్స్ అని దర్శకుడు కొద్ది రోజుల క్రితం కొట్టి పారేసారు. అయితే తాజాగా లైకా బ్యానర్ వాళ్లు ఇంకా సినిమా మొదలెట్టడంలో ఆలస్యం ఏమిటంటూ లీగల్ నోటీస్ పంపించారంటూ తమిళ వెబ్ సైట్స్ లో వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో నిజం లేదని కొందరంటున్నారు. అయితే లైకా వాళ్లు మాత్రం శంకర్ తో ఈ సినిమా రీలాంచ్ నిమిత్తం టెర్మ్ అండ్ కండీషన్స్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాసం ఉంది.