తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డి.వి.వి దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్ విషయంలో సంచలనం సృష్టిస్తుంది. `బాహుబలి` సినిమా మించి పోతుంది. తాజాగా తమిళ రైట్స్ ని ప్రముఖ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా ప్రొడక్షన్‌ సొంతం చేసుకుంది. `కత్తి`, `ఖైదీ నెంబర్‌ 150`, `వాడ చెన్నై`, `2.0`, `దర్బార్‌` వంటి చిత్రాలను నిర్మించిన, `ఇండియన్‌ 2`, `పొన్నియిన్‌సెల్వన్‌` వంటి భారీ చిత్రాలను నిర్మించిందీ సంస్థ. తాజాగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు తెలిపాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…

 భారీగా వెచ్చించి, ఇతర సంస్థలతో పోటీ పడి తమిళ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు 42 కోట్లకి `ఆర్‌ఆర్‌ఆర్‌` తమిళ థియేట్రికల్‌ రైట్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఇందులో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్‌ దేవగన్‌,సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.