అక్కినేని అఖిల్ మూడవసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మిస్టర్ మజ్ను సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అఖిల్ - హాలో ఫెయిల్యూర్స్ వల్ల ఆత్మ విమర్శ చాలానే చేసుకొని సిద్ధమయ్యాడని తారక్ కూడా చెప్పాడు. మిస్టర్ మజ్ను సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. యూఎస్ లో ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించనున్నారు. 

అయితే సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నప్పటికి సినిమా జనాల వరకు వెళ్లలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే సినిమాకు పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఏమి లేవు. 20 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మిస్టర్ మజ్ను ఆ మార్క్ ను దాటాలంటే ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ అసలు అఖిల్ ప్రమోషన్స్ లో ఉన్నాడా? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అఖిల్ సినిమా రిలీజ్ అవుతున్నట్లు పెద్దగా హంగామా అయితే లేదు. నాగ్ కూడా ప్రమోషన్స్ విషయంలో ఓ చెయ్యిస్తున్నప్పటికీ బజ్ క్రియేట్ అవ్వడం లేదు. ఈ సినిమాకు మొదటివారం ఉన్న ఒకే ఒక్క అడ్వాంటేజ్ పోటీగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు లేవు. హిందీ డబ్బింగ్ సినిమా మణికర్ణిక వస్తున్నప్పటికీ ఆ సినిమాకి కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. సంక్రాంతి సినిమాల హడావుడి తగ్గింది. సో అఖిల్ ఏ స్థాయిలో ఆడియెన్స్ ని మెప్పిస్తాడో చూడాలి.