Asianet News TeluguAsianet News Telugu

లవర్స్ క్లబ్ యూత్ కు నచ్చుతుందంటున్న నిర్మాత

  • లవ్ర్స్ క్లబ్ పేరుతో యూత్ ఫుల్ మూవీ
  • ఫస్ట్ లుక్ పోస్టర్ తో అటెన్షన్ క్రియేట్ చేసిన లవర్స్ క్లబ్

 

lovers club first look

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్  ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌. ఈ చిత్రాన్ని 

ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క ప్రీలుక్ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా, ఇప్ప‌డు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. సంక్రాంతి త‌రువాత ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని విడుదల చేస్తారు. ప‌క్కా యూత్‌ఫుల్ ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరిగా యువ‌త ని ఆక‌ట్టుకుంటుంది.

 

ఈ సంద‌ర్బంగా నిర్మాత భ‌ర‌త్ అవ్వారి మాట్లాడుతూ.. 2016 లో పెద్ద చిత్రాలు ఏరేంజి లొ సూప‌ర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజ‌యాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియ‌న్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మ‌నుగ‌డ‌కి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా ల‌వ‌ర్స్ క్ల‌బ్ ని తెర‌కెక్కించాం. మా కంటెంట్ ప‌క్కా ఎమెష‌నల్ గా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ పర్ఫోర్మన్సుస్ రాబట్టుకున్నారు. సంక్రాంతి త‌రువాత మా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఆడియ‌న్ ఈ మాట చెప్తారు. ఇటీవ‌లే ప్రీలుక్ అని విడుదల చేసిన మా పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో స‌న్సేష‌న్ అయ్యింది. ఇప్ప‌డు మా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. ఆడియో ని ఫిబ్ర‌వ‌రి లో విడుదల చేసి అదే నెల‌లో చిత్రాన్ని విడుదల చేయ్య‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ప్ర‌స్తుతం షూటింగ్ కార్క‌క్ర‌మాలూ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు ధృవ శేఖ‌ర్ మాట్లాడుతూ.. ల‌వ‌ర్స్ కి అండ‌గా నిల‌బ‌డే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్స్పిర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఇంతవరకు ఎవరు తీయని విధంగా ఈ టెక్నాలజీతో మేము తీసాం. ఈ టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళని, యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం.   వినోదాత్మ‌కంగా ఎమెష‌నల్ గా చిత్ర క‌థాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుకుగా తెర‌కెక్కించాం. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం ల‌వ‌ర్స్ క్ల‌బ్,  యూనిట్ మెత్తం చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి చేశాము.యూత్ ఫుల్ టీం కావ‌టంతో అందరు చాలా ఎన‌ర్జిగా ప‌నిచేశారు. స్క్రీన్ మీద కూడా అదే ఎనర్జి క‌న‌ప‌డుతుంది. మా ఫ‌స్ట్ లుక్ అందిరిని ఆక‌ట్టుకుంటుందని ఆశిస్తున్నాము. ఫిబ్ర‌వ‌రి లొ విడుద‌ల చేయ‌నున్నాము .. అని అన్నారు.

 

నటీనటులు:

అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి, ధీరజ్, చిత్రం బాష, వైజాగ్ ప్రసాద్. అజయ్ రత్నం,

సాంకేతిక నిపుణులు:

మ్యూజిక్: రవి నిడమర్తి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మదన్ గంజికుంట, అవ్వారి ధను

సహ నిర్మాతలు: నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి

నిర్మాత: భరత్ అవ్వారి

రచన-దర్శకత్వం: ధృవ్ శేఖర్

Follow Us:
Download App:
  • android
  • ios