టాలెంట్ ఉన్నవాళ్లను ఎవరూ ఆపలేరు ఇది ఎన్నో సార్లు సినీ పరిశ్రమలో నిరూపితమైన సత్యం. ఇప్పుడు మరోసారి నూరిస్ షెరిఫ్ రూపంలో మనకు కనపడబోతోంది. ఒకే ఒక్క క‌న్ను గీటుతో సౌతిండియా యూత్ ని త‌న‌వైపు తిప్పుకున్న చిన్నది ప్రియా ప్ర‌కాష్ వారీయ‌ర్. ఆమె  తొలి మ‌లయాళీ మూవీ ఇరు ఆదార్ ల‌వ్.. ఈ మూవీని తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో డబ్బింగ్  చేసి రిలీజ్ చేశారు.

యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ మూవీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అంతేకాదు ప్రియా ప్రకాష్ కు నటన రాదని విమర్శలు సైతం వచ్చాయి. ఆమెకు ఆ తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నూరిన్ కు మంచి మార్కులు పడ్డాయి.

న‌ట‌న ప‌రంగా ప్రియా వారీయ‌ర్ కంటే మ‌రో హీరోయిన్ నూరీన్ నే ఎక్కువ మంది మెచ్చుకున్నారు. స్టూడెంట్ గా, స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా గ్లామ‌ర్ తో తన పాత్రలో  లీన‌మై న‌టించిన తీరు అద్బుతమని పొగిడారు.. బావోద్వేగ సన్నీవేశాల‌లో ఆమె న‌ట‌న  సినిమాకు హైలెట్ గా నిలిచింది. దాంతో .. దాంతో  నూరీన్ కు మళయాళంలో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించే చిత్రంలో ఆమెను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఎవరు , మిగతా విషయాలు త్వరలోనే బయిటకు వస్తాయి. అలా మొత్తానికి నూర్ తెలుగలోకు ఎంట్రీ ఇస్తోందన్నమాట.