ప్రదీప్ రంగనాథన్.. 29 ఏళ్ల ఈ కుర్రాడి పేరు తమిళ, తెలుగు భాషల్లో మారుమోగింది. గత నెలలో విడుదలై సంచలన విజయం సాధించిన లవ్ టుడే చిత్రంతో ప్రదీప్ ఒక్కసారిగా సౌత్ ఇండియా ఫేమస్ అయ్యాడు.
ప్రదీప్ రంగనాథన్.. 29 ఏళ్ల ఈ కుర్రాడి పేరు తమిళ, తెలుగు భాషల్లో మారుమోగింది. గత నెలలో విడుదలై సంచలన విజయం సాధించిన లవ్ టుడే చిత్రంతో ప్రదీప్ ఒక్కసారిగా సౌత్ ఇండియా ఫేమస్ అయ్యాడు. లవ్ టుడే చిత్రానికి దర్శకుడిగా, హీరోగా అదరగొట్టాడు ప్రదీప్. యువతని మెప్పించడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టింది.
ఈ యువ దర్శకుడు, హీరో గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. దర్శకుడిగా ప్రదీప్ జాక్ పాట్ కొట్టేసినట్లు టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ప్రదీప్ దక్కించుకున్నాడట. రజనీకాంత్ ని డైరెక్ట్ చేయడం ప్రదీప్ కల. తన డ్రీమ్ నెరవేర్చుకునే ఛాన్స్ ప్రదీప్ కి చాలా త్వరగానే దక్కింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ డేట్లు.. లైకా నిర్మాణ సంస్థ వద్ద ఉన్నాయి. ఓ దర్శకుడితో సినిమా అనుకున్నప్పటికీ అది కుదర్లేదు. దీనితో లైకా సంస్థ ప్రదీప్ ని లైన్లో పెట్టింది. ప్రదీప్ ఇటీవల రజనీకి స్టోరీ లైన్ వినిపించి ఓకె చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ కంప్లీట్ స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలో కంప్లీట్ స్టోరీ నెరేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
లవ్ టుడే విజయం సాధించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రదీప్ ని అభినందించారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా అంటే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
