ప్రస్తుతం ఇవానాకి వరుసగా హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నాయి. మంచి పారితోషికం ఇచ్చి ఈ యంగ్ బ్యూటీతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ టుడే చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం యువతని ఉర్రూతలూగించింది. రొమాంటిక్ కామెడీ అంశాలతో మోడ్రన్ లవ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంతో ప్రదీప్ కి ఎంత పేరు వచ్చిందో.. హీరోయిన్ ఇవానాకి కూడా అంతే గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఇవానాకి వరుసగా హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నాయి. మంచి పారితోషికం ఇచ్చి ఈ యంగ్ బ్యూటీతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
అయితే తాజాగా ఇవానా స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా దళపతి విజయ్ చిత్రంలో నటించే ఆఫర్ కే నో చెప్పిందట. ప్రస్తుతం విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతటి స్టార్ హీరో సరసన ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది అని ఆశ్చర్యపోవచ్చు.

కానీ ఆ మీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సరైన కారణమే ఉంది. ఇవానాకి అవకాశం వచ్చింది హీరోయిన్ గా కాదు. విజయ్ చెల్లి పాత్రలో నటించేందుకు ఆమెని అడిగారట. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయ్ పక్కన చెల్లిగా నటిస్తే ఆ తరహా ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. దీనితో భయపడే ఇవానా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
