అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్తరం ‘లవ్ స్టోరీ’ . ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది.
లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని విధంగా అదరకొట్టింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సెకండ్ వేవ్ తరవాత తెలుగు చిత్ర సీమ చూసిన అతి పెద్ద హిట్ గా ఈ సినిమా గా అవతరించింది. అయితే ఫస్ట్ వీకెండ్ హంగామాని ఆ తర్వాత రోజులు కంటిన్యూ చేయలేకపోయింది.దాంతో చాలా డ్రాప్ కనపడిందని ట్రేడ్ లో టాక్స్ మొదలయ్యాయి. అలా సెకండ్ వీక్ లోకి ప్రవేశించింది. సెకండ్ వీక్ లో మొన్న శుక్రవారం సాయి తేజ రిపబ్లిక్ చిత్రం రిలీజైంది. దాని ఇంపాక్ట్ ఈ సినిమాపై పడుతుందని బావించారు. అయితే ఆ ప్రభావం ఏమీ లేదని తేలింది. సెకండ్ వీకెండ్ లో సిటీల్లో మల్టిఫ్లెక్స్ లు మాగ్జిమం హౌస్ ఫుల్స్ అయ్యినట్లు సమాచారం. టౌన్స్ లోని సింగిల్ థియేటర్స్ ,ముఖ్యంగా ఆంధ్రాలో మాత్రం ఆ ఊపు లేదు. శనివారం 96 లక్షలు షేర్ వసూలు చేసిందని సమాచారం.
ఫస్ట్ వీకెండ్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచిన లవ్ స్టోరి వరల్డ్ వైడ్ రూ.22 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అయితే వీకెండ్ తర్వాత ఈ సినిమాకు దెబ్బ పడింది. ఓ ప్రక్కన సినిమా క్లైమాక్స్ సరిగ్గా లేదంటూ డివైడ్ టాక్. అలాగే ఒక రోజు బంద్, మూడు రోజులు వర్షాలు వసూళ్లపై ప్రభావం చూపాయి. దీని వల్ల ఫస్ట్ వీకెండ్ తో పోలిస్తే తొలి వీక్ కలెక్షన్లు అనుకున్న స్దాయిలో లేవు. వీకెండ్ తర్వాత ఐదు రోజుల్లో ఐదు కోట్ల షేర్ రాబట్టి వారం మొత్తంలో రూ.27 కోట్ల షేర్‌తో నిలిచింది లవ్ స్టోరి.
అందుతున్న సమాచారం మేరకు లవ్ స్టోరీ బడ్జెట్ దాదాపుగా 35 కోట్లు. మరో 8 కోట్లు దాటితే టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే నాన్ థియేటరిల్ రైట్స్ రూపంలో దాదాపుగా 22 కోట్లు రావటం కలిసొచ్చే అంశం. అంటే అన్ని కలిసొస్తే.. దాదాపు 12 కోట్ల లాభాలు వచ్చినట్లే. సెకండ్ వీక్ లోనూ లవ్ స్టోరీ నిలకడైన వసూళ్లు రాబట్టాయి కాబట్టి కనీసం 20 కోట్ల లాభం కళ్ల చూసినట్టు అవుతుంది. ఈ శుక్రవారం రిలీజైన రిపబ్లిక్ సీరియస్ సినిమా కావడం, దానికి టాక్ సరిగ్గా రాకపోవడం లవ్ స్టోరికి కచ్చితంగా కలిసొచ్చిన అంశం. శనివారం విడుదల అయిన ఇదీ మా కథ మీద కూడా ప్రేక్షకులకు ఆసక్తి లేదు.
