వరస ప్రాజెక్టులు చేస్తోంది కానీ పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో చిత్రం హాలీవుడ్ లో చేసింది. సినిమా పేరు లవ్ ఎగైన్.


బాలీవుడ్‌లో ఒక టైమ్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఆ టైమ్ లోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. అక్కడే కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుని ప్రయత్నాలు చేస్తోంది. ప్రియాంక కంటే నిక్ వయస్సులో 10 ఏళ్లు చిన్నవాడు కావడంతో అప్పట్లో వారి పెళ్లి విషయంలో పెద్ద చర్చ జరిగింది. అయితే ఇంత చేసినా హాలీవుడ్ లో ఆమె తనకంటూ స్దానం సంపాదించుకోలేకపోయింది. వరస ప్రాజెక్టులు చేస్తోంది కానీ పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో చిత్రం హాలీవుడ్ లో చేసింది. సినిమా పేరు లవ్ ఎగైన్.

YouTube video player

ఈ సినిమాలో ఆమె ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ. బ్రేక్ అయిన ఒక అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె తన ఎక్స్ కు టెక్స్ట్ మెసేజ్ లు పంపుతూంటుంది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏమిటీ అంటే ...ఆమె ఫోన్ వేరే అతను దగ్గర ఉంటుది. అక్కడ నుంచి వీళ్లిద్దరు ఎలా ప్రేమలో పడ్డారనేదే మిగతా కథ. పాపులర్ సింగర్ Celine Dion ఈ సినిమాతో లాంచ్ అవుతున్నారు. అలాగే ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ప్రియాంక ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకుంది. మదర్శ్ డే అయిన మే 14 న సినిమా రిలీజ్ అవనుంది. ప్రియాంక ఈ చిత్రాన్ని స్వయంగా ప్రమోట్ చేయనుంది. ఇందుకోసం గ్లోబ్ మొత్తం టూర్ వేయనుంది. ఇండియాలో కూడా భారీగా రిలీజ్ చేయనున్నారు. 

ఇక ప్రియాంక చోప్రా క్వాంటికో షోతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకుంది. చివరగా ‘ది మ్యాట్రిక్స్ రీ సర్కషన్స్’ (The Matrix Resurrections) లో నటించింది. ఈ చిత్రంలో సాహసోపేతమైన పాత్రను పోషించింది. పర్శనల్ లైఫ్ కు వస్తే ... కొన్ని సంవత్సరాల క్రితం ఈ జంటకి సరోగసీ ద్వారా ఓ కూతురు (Daughter) జన్మించింది. ఆ పాపకి ఇద్దరి సంప్రదాయాలు కలిసేలా మాల్తి మేరీ (Malthi Marie) అని పేరు పెట్టుకున్నారు.