మహేష్ బాబు చాలా తెలివైన వాడు అని ఆయనతో పనిచేసిన వారంతా చెప్తూంటారు. తన కెరీర్ లో ఎక్కువ హిట్స్ రావటానికి కారణం ఆచి,తూచి అడుగులు వేయటమే అంటారు. ఒక్కసారి స్క్రిప్టు లాక్ చేస్తే తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగని ఆయన...ఆ లాకింగ్ విషయంలోనే రకరకాలుగా ఆలోచిస్తారట. ఆ డైరక్టర్ గత చిత్రాలు చూసి బేరీజు వేస్తారు. అలాగే ఇప్పుడు గీతా గోవిదం చూసి సర్కారు వారి పాట సినిమా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

గతేడాది కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథ, కథనం, లోకేష్ కనకరాజ్ టేకింగ్, కార్తి నటన వెరిసి ఈ సినిమా వెండితెరపై ఓ వండర్ నే క్రియేట్ చేసింది. అందుకే ఈ దర్శకుడుతో వెంటనే తమిళ హీరో విజయ్ మాస్టారు అనే చిత్రం చేసారు. ఆ చిత్రం కూడా ఖైదీ ని మించి హిట్ అవుతుందని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఈ విషయం తెలుగుసున్న మహేష్ బాబు...ఈ దర్శకుడుతో భేటీ అయ్యి..తన తదుపరి చిత్రానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు తమిళ సినీ పరిశ్రమలో వార్తలు మొదలయ్యాయి. 

ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ''మాస్టర్'' సినిమా రూపొందిస్తున్న లోకేష్ కనకరాజన్ తదుపరి సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారితో చేయడానికి కమిట్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మహేష్ తో సినిమా నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ వారు మహేష్ బాబు - లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో మూవీ చేయాలని ప్లాన్స్ చేసుకున్నారని ఆ వార్తల సారాంశం.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా 'సర్కారు వారి పాట'ను అనౌన్స్ చేసారు మహేష్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. కొద్ది పాటి సందేశం, కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఉంటుందని   మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.