రజనీకాంత్ సినిమా నుంచి లోకేష్ కనగరాజ్ ఔట్.. నిజమెంత..?
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తప్పుకున్నారా..? ఆయన్ను ఈసినిమా నుంచి తప్పించారా..? కారణం ఏంటి..? అసలు ఇందులో నిజం ఎంత..?

తాజాగా జైలర్ సినిమాతో రికార్డ్ లు బ్రేక్ చేశాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth).తలైవా 169వ సినిమాగా వచ్చిన జైలర్ భారీ అంచనాలతో తెరకెక్కి.. అంతకుమించిన ఫలితాన్ని ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జైలర్ వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ మరోవైపు ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170) కూడా ప్రకటించాడు.
జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో ఈసినిమాను చేస్తున్నారు రజనీకాంత్. ఈమూవీని లైకా ప్రొడక్షన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. జైలర్ సినిమా సక్సెస్ లో మేజర్ కారణంగా నలిచింది... యంగ్ సెన్సేషన్.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా 170 తరువాత లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj)దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రజినీకాంత్. ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్‌తో లియో సినిమా తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం లియో తర్వాత తలైవా 171 సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు లోకేశ్ కగనరాజ్. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ కనగరాజ్ తప్పుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్ కు షాక్ కలిగిస్తుంది. అయితే లోకేష్ రజనీకాంత్ కు చెప్పిన కథలో.. తలైవా క్యారెక్టరైజేషన్.. మిలటరీ గెటప్ లో ఉంటుంది.. ఆ కథ.. రజనీస్టైల్ అంతా.. నెల్సన్ దిలీప్ ఆల్ రెడీ జైలర్ లో చూపించడంతో.. ఇక తాను అనుకున్నది డెవలప్ చేయడం ఎందుకూ అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే లోకేశ్ కగనరాజ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.. మరి దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, నా రెడీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ మరోవైపు కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో తలైవా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లాల్‌సలామ్ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు టీమ్.