Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ తో సినిమానే ఆ డైరక్టర్ లాస్ట్ ఫిల్మ్!?

డిసెంబర్ 22న సలార్ పాన్ ఇండియా రేంజ్ లో.. వివిధ భాషలలో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియాని షేక్ చేసిన కేజీఎఫ్ సిరీస్ కి కొనసాగింపుగా సలార్ వస్తున్నట్లు తెలుస్తుంది.

Lokesh Kanagaraj officially confirms a film with Prabhas jsp
Author
First Published Oct 8, 2023, 11:18 AM IST


ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి అంటున్నాయి గత కొంతకాలంగా తమిళ సినీ వర్గాలు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’  చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన ప్రస్తుతం విజయ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో బాగంగా  ప్రభాస్‌తో సినిమా చేయనున్నారని ఖరారు చేసారు లోకేష్.  ప్రభాస్ తో సినిమా ఉంటుంది.. కానీ టైమ్ పడుతుందని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అందుకోసం కథ సిద్దం చేస్తునట్టు తెలుస్తోంది.   అయితే ప్రభాస్ తో చేయబోయే చిత్రమే లోకేష్ చివరి చిత్రం అని చెప్తున్నారు.

రీసెంట్ గా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... హాలీవుడ్‌ లెజెండ్‌ డైరెక్టర్‌ క్వింటెన్‌ టరెంటీనోలా తాను కూడా పది సినిమాలు చేసిన తర్వాత ఫిల్మ్‌ మేకింగ్‌ ఆపేస్తానని అన్నారు.   ‘‘నాకు సుదీర్ఘ ప్రణాళికలు ఏవీ లేవు. అలాగే, ఇక్కడే (సినిమా ఇండస్ట్రీలో) శాశ్వతంగా ఉండిపోవాలని అస్సలు లేదు. నేను సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చా. అందుకే మొదట షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా. నాకు గురి కుదిరిన తర్వాత దీన్నొక వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాల వరకూ చేస్తా. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా’’ అని అన్నారు.

‘‘ఒక కథతో సినిమాటిక్‌ యూనివర్స్‌ సృష్టించడం అంత సులభమైన విషయమేమీ కాదు. చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. ప్రతి సినిమాకు సంబంధించిన నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్‌వోసీ  తీసుకోవాలి. నాతో పనిచేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు. వారి వల్లే సినిమాటిక్‌ యూనివర్స్‌ సాధ్యమవుతోంది. ఎల్‌సీయూలో 10 సినిమాలు వస్తాయేమో చూడాలి. . రెండోసారి విజయ్‌ అన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.  ఆ తర్వాత ఆయన్ను మిస్‌ అవుతా. ‘లియో’ ఎల్‌సీయూలో భాగమా కాదా? అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజులు  వేచి చూడండి. మీకే తెలుస్తుంది’’ అని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పుకొచ్చారు.\

అలాగే ఈ మూవీ తరువాత లోకేష్ లైనప్ ఏంటని అడగగా, దర్శకుడు బదులిస్తూ.. రజినీకాంత్‌తో Thalaivar 171, కార్తితో ఖైదీ-2, కమల్‌తో విక్రమ్-2, సూర్యతో రోలెక్స్, ప్రభాస్‌తో చివరి సినిమా అని తెలియజేశాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ ‘ఎండ్ గేమ్’ చిత్రం కాబోతుందని తెలుస్తుంది. గతంలో లోకేష్ ఒక ఫంక్షన్ లో తన డ్రీం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ఆ సినిమా తెరకెక్కిస్తానని చెబుతూ ఆ మూవీ స్టోరీ లైన్ కూడా రివీల్ చేశాడు. ‘ఒక యాక్సిడెంట్ లో చెయ్యి పోగుట్టుకున్న హీరో.. ఐరన్ హ్యాండ్ అమర్చుకొని క్రైమ్స్ సిండికెట్ లో ఏం చేశాడనేది’ సినిమా కథ అని పేర్కొన్నాడు. అంటే లోకేష్  సినిమాటిక్‌ యూనివర్స్‌  లో లాస్ట్ ఫిల్మ్  ది ఎండ్ గేమ్ అన్నమాట. ఆ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టి ఇంక తన కెరీర్ నుంచి రిటైర్ అవ్వుతారన్నమాట. 

ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని సినీ పరిశ్రమల నుంచి దర్శకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.   ప్రభాస్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ మూవీ రెడీ చేశాడు.  లార్ పాన్ ఇండియా రేంజ్ లో.. వివిధ భాషలలో రిలీజ్ కాబోతుంది.   కేజీఎఫ్ 2కి మించి అంచనాలు సలార్ పై సెట్ అయ్యాయి. మేకర్స్ ప్రమోషన్స్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ‘కల్కి 2898AD’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జానర్ ఆ సినిమా పాన్ వరల్డ్ ని ఊపేయనుంది.  మధ్యలో మారుతి సినిమా ఆ తర్వాత  ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios