కంగనా రనౌత్ సంచలనాలకు మారు పేరు. సామాజిక మాధ్యమాలలో ఆమె చేసే కామెంట్స్, ఆరోపణలు పతాక శీర్షికలు ఎక్కుతూ ఉంటాయి. తాజాగా ఆమె లాకప్ షోలో చేసిన లైంగిక ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి.
ఏక్తా కపూర్ నిర్మాతగా ఓటీటీలో స్టార్ట్ అయిన లాకప్ షో (Lock Up Show)చివరి దశకు చేరింది. ఫైనల్ సమీపిస్తుండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ శక్తి వంచన మేరకు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠగా మారింది. హోస్ట్ కంగనా రనౌత్ షోలోకి ఎంటర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాకప్ షో కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన కంగనా... తాను లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. చిన్న తనంలో తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలియజేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కంగనా హోమ్ టౌన్ ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందట.
ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు బాడ్ టచ్ గుడ్ టచ్ మధ్య వ్యత్యాసం తెలియజేయాలి అన్నారు. లాకప్ కంటెస్టెంట్ గా ఉన్న మునావర్ ఫరోహి తాను ఆరేడేళ్ల వయసులో లైంగిక వేధింపులు గురైనట్లు తెలియజేశాడు. దీని గురించి మాట్లాడిన కంగనా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించారు. నా సొంత గ్రామంలో నా కంటే వయసులో కొన్నేళ్లు పెద్దవాడైన ఓ అబ్బాయి తప్పుగా నన్ను తాకాడు. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. ప్రతి చిన్నారి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళను కాపాడాల్సి ఉంది.. అంటూ కంగనా చెప్పుకొచ్చారు.
చిన్న పిల్లలను ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవాలని ఆమె చెప్పారు. కంగనా (Kangana Ranaut) లాకప్ షో చాల బోల్డ్ గా సాగుతుంది. ఈక్రమంలో మంచి వ్యూవర్షిప్ సాధించినట్లు తెలుస్తుంది. ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ షోని జనాలు బాగానే చూస్తున్నారు. సల్మాన్ బిగ్ బాస్ షోని బీట్ చేస్తామని కంగనా ఛాలెంజ్ చేయగా... ఆమె కొంత మేర సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నారు.
ఇక లేటెస్ట్ రిలీజ్ తలైవి. అనుకున్నంత కాకపోయినా సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. ప్రస్తుతం ఆమె హీరోగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ధాకడ్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్, అలాగే తేజాన్ టైటిల్ తో మరో చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఆమెకు కలిసొచ్చిన జోనర్ లో నిర్మాతగా టికు వెడ్స్ షేరు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
