మలయాళం మెగాస్టార్ మమ్ముంటి ఏ సినిమా చేసిన అభిమానులకు ఎదో విధంగా మంచి కిక్ ఇస్తుంది'. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజైన మొదటి వారం ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంటాయి. ఇక యాక్టింగ్ లో నేషనల్ వైడ్ గా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఈ మెగాస్టార్ ఇప్పుడు సన్నీ లియోన్ తో చిందులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఆమెతో ఉన్న ఒక ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మమ్ముంటి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం మధుర రాజా. 2010లో వచ్చిన సూపర్ హిట్ సినిమా పొక్కిరి రాజాకు ఇది రీమేక్. యాక్షన్ ఫిల్మ్ గా రానున్న ఈ సినిమాలో మమ్ముంటి కాంట్రవర్షియల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో సన్నీ లియోన్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

షూటింగ్ స్పాట్ లో ఇటీవల వీరు కలిసి ఉన్న ఫొటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకు క్రేజ్ మాత్రం మాములుగా లేదు. మరోవైపు మమ్ముంటి యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.