Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లీష్ అక్షరాలతో మాయ చేస్తున్న ఆఫ్ఘన్ చిన్నారి.. క్యూట్ వీడియోకి బాలీవుడ్ బ్యూటీ ఫిదా

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు.

little afghan girl speaking english letters with cute voice bollywood actress reacts
Author
First Published Dec 10, 2022, 9:43 AM IST

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు.  ప్రస్తుతం రవీనా వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు.   

రవీనా టాండన్ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. హిందీలో వివిధ షోలకు హాజరవుతూ చలాకీగా మాట్లాడుతూ ఉంటుంది. సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ ఆమెలో హుషారు ఇంకా తగ్గలేదు. దేశంలో జరిగే అన్ని ప్రధాన అంశాలపై రవీనా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా రవీనా ఒక వైరల్ వీడియోపై స్పందించింది. ఆఫ్గనిస్తాన్ లోని ఒక స్కూల్ లో చిన్నారి తన టీచర్ కి ఇంగ్లీష్ లెటర్స్ అప్పజెబుతున్న వీడియో అది. ఆ చిన్నారి ఎనెర్జిటిక్ గా, చిరునవ్వుతో తన టీచర్ కి ఇంగ్లీష్ అక్షరాలు చకచకా అప్పజెప్పేసింది. ఆ చిన్నారి ఒకటి రెండు అక్షరాలు మిస్ చేసింది కానీ.. ఆ క్యూట్ నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. 

తన తోటి విద్యార్థులంతా చప్పట్లతో ఆ చిన్నారిని అభినందించారు. ఓ జర్నలిస్ట్ ఈ వీడియో షేర్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోపై రవీనా టాండన్ స్పందిస్తూ కామెంట్ పెట్టింది. ఈ రోజు నా ట్విట్టర్ లైన్ లో ఇది చాలా క్యూటెస్ట్ విషయం అంటూ రవీనా పోస్ట్ చేసింది. నెటిజన్లు ఆ చిన్నారికి ఫిదా అవుతున్నారు. వివిధరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ విద్యాహక్కు ఉండాలి.. ఆ చిన్నారి వాయిస్ వెరీ క్యూట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈరోజు ఇంటర్నెట్ లో ఇది అద్భుతమైన వీడియో అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 

ఇక సినిమాల విషయానికి వస్తే రవీనా టాండన్ కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధాన మంత్రిగా పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది. ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ఆమె భర్త. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలని అతడు బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios