"రాత్రిపూట కూడా నాన్నగారితో ఉంటుందా...'

"ఈ వయస్సులో కూడా ఆడవాళ్లవాళ్ల మీద మీకు అంత కోరిక ఉంటే...'

"మగ ఆడకలిస్తే ఒట్టి మాటలే ఉండవుగా..."

ముండా...

ఇవన్నీ  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం కోసం వర్మ రాయించినవి. అయితే వీటిని సెన్సార్ కట్ చేసేసింది. ఇంకా ఇలా సినిమాలో తొలిగించబడ్డ డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని మీరు క్రింద చూడవచ్చు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రం ఈ రోజు( మార్చి 29న) ఆంధ్రా మినహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా విడుదల అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టే పై మాట్లాడడానికి శుక్రవారం రామ్ గోపాల్ వర్మ మీడియాతో సమావేశం కానున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కట్స్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది. సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో సెన్సార్ కట్ చేసిన, మ్యూట్ చేసిన డైలాగులను మీరు ఇక్కడ లిస్ట్ చూడండి.

ఇక  ఈ చిత్రం ఈ రోజు ఆంధ్రాలో  విడుదల కావడం లేదు.  ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించవద్దని హైకోర్టు చిత్ర  యూనిట్ ని ఆదేశించింది. ఏపీలో జరిగే ఎన్నికలు పూర్తయ్యే దాకా సినిమాను థియేటర్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించ రాదని కోర్టు ఆదేశించింది. అయితే ఈ స్టే కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అవుతోంది.  ఈ రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో విడుదల కానుంది.

ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.