Asianet News TeluguAsianet News Telugu

పవన్,త్రివిక్రమ్ మూవీతో అలనాటి తార రీఎంట్రీ

  • 90వ దశకంలో పలు హిట్ సినిమాల్లో నటించిన లిస్సీ లక్ష్మి
  • మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ ను పెళ్లి చేసుకున్న లిస్సీ
  • పాతికేళ్ల తర్వాత తెలుగు మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న లిస్సీ లక్ష్మి
  • నితిన్-మేఘా జంటగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాతో రీఎంట్రీ
lissy lakshmi come back after 25 years

నైంటీస్ లో... సౌత్ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హిరోయిన్ లిజీ లక్ష్మి. కేరళకు చెందిన లిజీ 80కిపైగా మలయాళం చిత్రాల్లో... పదుల సంఖ్యలో తెలుగు, తమిళం చిత్రాల్లో నటించారు. తెలుగులో సాక్షి, మగాడు, దోషి నిర్దోషి, 20వ శతాబ్దం, మామాశ్రీ, ఆత్మబంధం, శివ శక్తి తదితర చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగులో సుమన్ తో చేసిన 'ఆత్మబంధం' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. హీరోయిన్‌గా ఫాంలో ఉన్నపుడే ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను పెళ్లాడిన లిజీ తర్వాత నటనకు దూరం అయ్యారు.

 

దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత తాను తెలుగు సినిమా ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని, ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్నారని లిజీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లీజీ రీ ఎంట్రీ ఇస్తున్న మూవీలో నితిన్-మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పికె క్రియేటివ్ వర్క్స్ బేనర్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్నట్లు లిజీ తెలిపారు.

 

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరాముందుకు వచ్చాను. న్యూయార్క్ లో జరుగుతున్న షూటింగులో కాస్త నర్వస్‌గానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఇన్నాళ్లు దీన్ని మిస్సయ్యాను అని లిజీ తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో పూర్తయిందని, సెకండ్ షెడ్యూల్ కూనూర్‌లో అని వెల్లడించారు.

 

ఇక అప్పట్లో యాక్టింగ్ వదిలేసే ముందు తెలుగులో 8 సినిమాలు చేశాను. అందులో 6 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో మలయాళం రీమేక్స్ ‘20వ శతాబ్ధం', ‘మగాడు' చిత్రాలు కూడా ఉన్నాయన్నారు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని వదిలివెళ్లినందుకు చాలా బాధ పడ్డాను. కానీ అపుడు నాకు వేరేదారి కనిపించలేదు. నాడు నాకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని లిజీ తెలిపారు. 22 సంవత్సరాల వయసులోనే తాను నటనను వదిలి పెట్టానంది. ఆ సమయంలో నా బ్యాగ్ నిండా అవకాశాలు ఉన్నా... అన్నింటికీ కాదనుకుని వెళ్లిపోయాను అని లిజీ గుర్తు చేసుకున్నారు.

 

గత మూడేళ్లుగా నేను మలయాళం, తమిళం, తెలుగులో కథలు వింటున్నాను. ఫైనల్ గా తెలుగు ప్రాజెక్టు ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. షూటింగ్ ఎక్స్‌ పీరియన్స్ చాలా బావుంది. సినిమా యూనిట్ సభ్యులు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు అని లిజీ తెలిపారు.

మలయాళంలో నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మలయాళం సినిమా చేస్తాను. నా జీవితంలో నేను సగం జీవితం చెన్నైలోనే గడిపాను. అందుకే నన్ను నేను హాఫ్ తమిలియన్‌గా, హాఫ్ మలయాళీగా చెప్పుకుంటానని లిజీ తెలిపారు.

 

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో' మూవీ ద్వారా లిజీ కూతురు కళ్యాణి హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్లో కళ్యాణి లుక్ సూపర్బ్ గా ఉందని, చాలా అందంగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios