Asianet News TeluguAsianet News Telugu

వెన్నెలకంటి కాలం నుంచి జాలువారిన టాప్‌ సాంగ్స్ ఇవే..

వెన్నెలకంటిగారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. డబ్బింగ్‌ సినిమాల అనువాద పాటలే కాదు, స్ట్రెయిట్‌ సినిమాలకు కూడా వినసొంపైన పాటలు రాసి మెప్పించారు. ఏ రైటర్‌కైనా ఎక్కువ మంది మెచ్చిన పాటలుంటాయి. ఎక్కువగా పాపులర్‌ అయిన పాటలుంటాయి. అలా వెన్నెలకంటికి కూడా కొన్ని పాపులర్‌ పాటలున్నాయి. 

liricist vennelakanti top songs  arj
Author
Hyderabad, First Published Jan 5, 2021, 8:10 PM IST

వెన్నెలకంటిగారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. డబ్బింగ్‌ సినిమాల అనువాద పాటలే కాదు, స్ట్రెయిట్‌ సినిమాలకు కూడా వినసొంపైన పాటలు రాసి మెప్పించారు. ఏ రైటర్‌కైనా ఎక్కువ మంది మెచ్చిన పాటలుంటాయి. ఎక్కువగా పాపులర్‌ అయిన పాటలుంటాయి. అలా వెన్నెలకంటికి కూడా కొన్ని పాపులర్‌ పాటలున్నాయి. 

1988లో వచ్చిన `మహర్షి` చిత్రంలోని ఆయన రాసిన `మాటరాని మౌనమిది` అనే పాట ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు విశేషంగా శ్రోతకాదరణ పొందింది. దీంతోపాటు `కొంత కలాం కొంతం కాలం కాలమాగిపోవాలి.. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి.. ` అంటూ సాగే `చంద్రముఖి`లోని ఈ పాట ఎంతగా ఊపిందో తెలిసిందే. అలాగే `అన్నా చెల్లెలు చిత్రంలోని `అందాలు ఆవురవురయ్యాయ` పాట బాగా ఆకట్టుకుంది. ఈ పాట హిట్‌ కావడంతోనే వెన్నెలకంటి తన ఎస్‌బీఐ జాబ్‌కి రిజైన్‌ చేసిన పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు. 

వీటితోపాటు `సన్నజాజి పడక.. `(క్షత్రియ పుత్రుడు),`రాసలీల వేళ రాయబామేల.. మాటే మౌనమై మాయజేయనేలా..`(ఆదిత్య 369), `మధురమే సుధాగానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహనగీతం..  మెదిలే తొలి సంగీతం..`(బృందావనం). `నీటిమీద రాతేకాదా ప్రాణమైనా దేహమూ.. ఓటికుండ మోతేలేరా పెంచుకున్న పాశమూ.. ఎవరి కోసమేనాడైనా ఆగబోదు కాలమూ.. `, `చల్తీ కా నామ్‌ గాడీ..`(చెట్టు కింద ప్లీడరు), `మాటంటే మాటేనంట..`(ఏప్రిల్‌1 విడుదల), `భీమవరం బుల్లోడా..` (ఘరానా బుల్లోడు), కొండా కోనల్లో లోయల్లో.. `(స్వాతికిరణం),  `రావయ్య ముద్దుల మామ.. `(సమరసింహరెడ్డి), `ప్రేమంటే ఏమిటంటే..`(శీను), `హృదయం ఎక్కడున్నది..`(గజిని), వంటి పాటలు విశేషంగా ఆదరణ పొందాయి. 

ఆయన రాసిన సినిమాలను ఓ సారి చూస్తే, `మహర్షి`, `చెట్టుకింద ప్లీడరు`, `శ్రీరామచంద్రుడు`, `తేనెటీగ`, `ఏప్రిల్‌ 1 విడుదల`, `ఆదిత్య 369`, `స్వాతికిరణం`, `అల్లరి ప్రియుడు`, `వన్‌ బై టూ`, `ముగ్గురు మొనగాళ్లు`, `భైరవద్వీపం`, `శ్రీకృష్ణార్జున విజయం`, `సమరసింహారెడ్డి`, `అన్నయ్య`, `నరసింహనాయుడు`, `టక్కరి దొంగ`, `పట్నాటి బ్రహ్మనాయుడు`, `చంద్రముఖి`, `ఒక్క మగాడు`, `అవారా` వంటి చిత్రాలున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios