టాలీవుడ్ నయా ట్రెండ్.. లిప్ లాక్ సెంటిమెంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 18, Aug 2018, 1:44 PM IST
lip lock scenes in tollywood becomes sentiment
Highlights

ఒకప్పటి దక్షిణాది సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అప్పటితారలు తమ హావభావాలు, నటన, కళ్లతోనే శృంగారాన్ని పలికించేవారు

ఒకప్పటి దక్షిణాది సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అప్పటితారలు తమ హావభావాలు, నటన, కళ్లతోనే శృంగారాన్ని పలికించేవారు. కానీ నేటి చిత్రాలలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ అంటూ హద్దులు మీరుతోన్న శృంగారాన్ని తెరపై చూపిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమా వరకు కూడా టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ తెరపై చూపించడానికి దర్శకనిర్మాతలు ఆలోచించేవారు. హీరోయిన్లు కూడా అటువంటి ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడేవారు. కానీ 'అర్జున్ రెడ్డి' తో లిప్ లాక్ సీన్స్ తెలుగు సినిమాల్లో కామన్ గా మారిపోయాయి.

ఆ సినిమాలో దాదాపు 60 లిప్ లాక్స్ సీన్స్ ఉన్నాయని హీరో విజయ్ దేవరకొండ విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ ఏడాదిలో విడుదలైన 'నా పేరు సూర్య','రంగస్థలం' వంటి పెద్ద చిత్రాల్లో కూడా లిప్ లాక్ సీన్స్ ని మిస్ చేయలేదు. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'RX 100' సినిమాలో లెక్కకి మించిన లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. సినిమా హిట్ అవ్వడానికి కూడా కారణం హీరోయిన్ బోల్డ్ పెర్ఫార్మన్స్, ఈ లిప్ లాక్ సన్నివేశాలనే చెప్పాలి. యూత్ కి తొందరగా కనెక్ట్ అవుతున్న ఈ బోల్డ్ సీన్స్ ని తమ సినిమాల్లో పెట్టి వారిని ఆకర్షించే పనిలో పడ్డారు మేకర్స్.

'గూఢచారి' సినిమాలో అడివి శేష్, శోభితల మధ్య కూడా డీప్ లిప్ లాక్ సీన్స్ ని చూపించారు. అడివి శేష్ ఈ లిప్ లాక్ ఓ సెంటిమెంట్ గా మారిందని తన తదుపరి సినిమాల్లో కూడా వీటిని కంటిన్యూ చేయనున్నాడని సమాచారం. కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో కూడా ఈ తరహా సన్నివేశాలు దర్శనమిస్తాయి. రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ ఉన్నట్లు ముందుగానే లీక్ అయినప్పటికీ సినిమాలో మాత్రం ఆ సీన్ ను సగం వరకే చూపించి ఎండ్ చేసేశారు మేకర్స్. తాజాగా విడుదలైన 'పేపర్ బాయ్' ట్రైలర్ లో కూడా లిప్ లాక్ సీన్స్ దర్శనమిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో ఈ లిప్ లాక్ సీన్స్ ఓ సెంటిమెంట్ గా మారాయనే చెప్పాలి.  

loader