Asianet News TeluguAsianet News Telugu

లైగర్ మిస్టేక్స్... పూరి ఆ విధంగా రూ. 25 కోట్లు వేస్ట్ చేశారు! 


లైగర్ మూవీ దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఓ నైట్ మేర్. నిర్మాతగా కూడా ఉన్న పూరీని తీవ్ర నష్టాలకు గురి చేసిన చిత్రం. దీనికి పూర్తి బాధ్యత పూరీదే. 

liger moive mistakes all spent on mike tyson for liger in vain
Author
First Published Sep 1, 2022, 9:39 AM IST

కథ కోసం, కథకు అవసరమైతే డబ్బులు ఖర్చుబెట్టాలి. హైప్ కోసం అదనపు ఖర్చుతో హంగులు అద్దాలని చూస్తే సినిమాకు ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది. లైగర్ మూవీలో మైక్ టైసన్ అప్పీరెన్స్ కూడా అలాంటిదే. అసలు ఆ సినిమాకు మైక్ టైసన్  కేమియో అవసరం లేదు. కానీ మా సినిమాలో మాజీ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ నటించాడని చెప్పుకోవడానికి ఆయన్ని తీసుకొచ్చి సినిమాకు అతికించారు. ఈ ప్రయోగం నిజంగా దెబ్బగొట్టింది. మైక్ టైసన్ గురించి తెలిసినవాళ్ళు ఆయన పాత్ర గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు. తెలియని వారు అసలు ఆ మైక్ టైసన్ ఎవరో? ఎందుకు వచ్చాడో అన్నారు?. 

అప్పటికే సినిమా మీద విరక్తి కలిగిన ప్రేక్షకులకు లాస్ట్ లో మైక్ టైసన్ ఎంట్రీ మరింత చిరాకు పుట్టించింది. సినిమాకు భారంగా మారిన ఆ పాత్ర, బడ్జెట్ పరంగా కూడా భారమైంది. మైక్ టైసన్ కి పూరి టీం రూ. 40 కోట్ల వరకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా వాస్తవంగా రూ. 20 నుండి 25 కోట్లు ఇచ్చారని బాలీవుడ్ మీడియా హంగామా రిపోర్ట్ చేసింది. మరొక లెక్క ప్రకారం మైక్ టైసన్ నెట్ రూ. 15 కోట్లు తీసుకున్నారని, ఆయన టీంతో పాటు షూటింగ్ ఖర్చులు కలిపి రూ. 25 కోట్లు అయ్యింది అంటున్నారు. 

వాస్తవంలో మైక్ టైసన్ కోసం లైగర్ నిర్మాతలు ఎంత ఖర్చుబెట్టినా అదంతా వృధా అయ్యింది. పాన్ ఇండియా మూవీ అంటే ఆ రేంజ్ కంటెంట్ ఉండాలని మరచిన పూరి, కేవలం అదనపు హంగులు, విపరీతమైన ప్రచారంతో హైప్ తెచ్చి క్యాష్ చేసుకోవాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. తలలు బద్దలు కొట్టుకొని గొప్ప కంటెంట్ తో తెరకెక్కించిన చిత్రాలనే ప్రేక్షకులు నచ్చకపోతే దేకడం లేదు. అలాంటిది సీరియస్నెస్ లేకుండా పాటలు, ఫైట్స్, రొమాన్స్ కలగలిపి ఓ సినిమా తీసి వదులుతానంటే కుదురుతుందా. నువ్వు మారాలి పూరి, నీ టాలెంట్ బయటికి తీయాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios