తాను నటిస్తున్న `లైగర్` చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ `లైగర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
`రౌడీబాయ్` విజయ్ దేవరకొండ కాస్త ఇప్పుడు `లైగర్` అయ్యారు. తాను నటిస్తున్న సినిమా పేరునే లైగర్‌గా మార్చుకున్నారు. ఇప్పుడు వేట స్టార్ట్ చేయబోతున్నారు. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాను నటిస్తున్న `లైగర్` చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ `లైగర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది.
ప్రపంచ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రమోషన్ షురూ చేసింది యూనిట్. లైగర్ హంటింగ్ పేరుతో మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో నుంచి ఓ స్పెషల్ థీమ్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల 9న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సర్‌ప్రైజ్ రాబోతుందట.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంది. హీరో పాత్రని పరిచయం చేసేలా ఉన్న ఆ గ్లింప్స్ అంచనాలను పెంచింది. ఇప్పుడు రాబోయే థీమ్ సాంగ్ వీడియో మరింతగా ఆకట్టుకుంటుందని, గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం. తాజాగా ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ తెలిపారు. తాను ఆకలితో ఉన్నానని, ఇండియా కూడా ఆకలిగా ఉందని, అసలు మ్యాటర్ విప్పే టైమ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
