లై సినిమాలో నితిన్ సరసన నటించిన మేఘా ఆకాష్ హాట్ హాట్ అందాలతో యూత్ ను ఆకట్టుకున్న మేఘా లై ఫ్లాప్ కావడంతో మేఘాకు అవకాశాలివ్వటానికి వెనుకాడుతున్న నిర్మాతలు
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే కాజల్, సమంత, త్రిష,నయన్ లాంటి హీరోయిన్లు సీనియారిటీ పెరిగిపోయి కాస్త దూకుడు తగ్గించారు. రకుల్ ప్రీత్ సింగ్,కీర్తి సురేష్, రెజీనా, రాశీఖన్నా, నివేదా థామస్.. అనూ ఇమ్మాన్యుయేల్ .. అనుపమ పరమేశ్వరన్ .. సాయిపల్లవి లాంటి హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రకూల్ ప్రిత్ సింగ్ అయితే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ మద్య నేను లోకల్ తో కీర్తి సురేష్, ఫిదా చిత్రంతో సాయిపల్లవి, నిన్ను కోరి చిత్రంతో నివేదా థామస్ మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఈ మద్య నితిన్ జోడీగా 'లై' మూవీ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి మురిపించిన మేఘా ఆకాశ్ మంచి అవకాశాలు కలిసి వస్తాయని ఊహించారు. అంతే కాద ఈ సినిమాకు ముందు రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' లోను ఛాన్స్ వచ్చింది..కానీ ఆ సినిమా కు నో చెప్పి నితిన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ సినిమాలో అమ్మడి హాట్ హాట్ అందాలు చూసి చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించారు. కానీ 'లై' సినిమా ప్లాప్ కావడంతో, వాళ్లంతా కూడా వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. పాపం రామ్ తో వచ్చిన చాన్స్ మిస్ కావడం..‘లై’ సినిమా ఫ్లాప్ కావడంతో మేఘా ఆకాశ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ వైపు కన్నేసినట్లు తెలుస్తుంది.
