`లియో` టైటిల్ వివాదంపై పిటీషన్ కొట్టివేత.. రిలీజ్‌కి లైన్ క్లీయర్
విజయ్ హీరోగా నటించిన `లియో` మూవీకి తెలుగు రిలీజ్‌కి సంబంధించి టైటిల్ వివాదం నెలకొంది. అయితే తాజాగా అన్నీ క్లీయర్ అయ్యాయి. కోర్ట్ పిటిషన్‌ని కొట్టివేసింది.
దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `లియో`. `విక్రమ్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. త్రిష హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, అర్జున్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. `విక్రమ్` తర్వాత లోకేషన్ కనగరాజ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రేపు గురువారం(అక్టోబర్ 19)న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
తెలుగులో సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు వెర్షన్‌కి సంబంధించి వివాదం నెలకొంది. తెలుగులో `లియో` పేరుతో ఆల్ రెడీ ఓ టైటిల్ `డీ స్టూడియో` పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో తన టైటిల్ తో `లియో` చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం పట్ల వారు అభ్యంతరం తెలిపారు. కోర్ట్ మెట్లు ఎక్కారు. ఇది సినిమా విడుదలపై సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. తాజాగా ఆ సమస్య సాల్వ్ అయ్యిందట. కేసు వేసిన వ్యక్తితో నిర్మాత మాట్లాడి సెటిల్ చేసుకోవడంతో కోర్ట్ ఈ పిటీషన్ ని బుధవారం కొట్టివేసింది. రిలీజ్‌కి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేస్తూ సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో `లియో` తెలుగు రిలీజ్‌కి అడ్డంకి క్లీయర్ అయ్యిందని చెప్పొచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచే షో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కేసు వేసిన వ్యక్తికి నిర్మాత నాగవంశీ 25లక్షలు ఇచ్చి సెటిల్ చేసినట్టు సమాచారం. దీంతో టైటిల్ వివాదం క్లీయర్ అయ్యింది. `లియో` తెలుగు రైట్స్ ని నిర్మాత నాగవంశీ రూ.16కోట్లకి కొనుగోలు చేశారట. సినిమాకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో అంత భారీ మొత్తానికి తీసుకున్నట్టు తెలుస్తుంది.