తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ పట్ల నివాళి అర్పిస్తూ.. విజయ్ దళపతి ‘లియో’ నుంచి రానున్న అప్డేట్ ను మేకర్స్ వాయిదా వేశారు. 

తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) కూతురు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. మీరా ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడంతో కోలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దళపతి ‘లియో’ మేకర్స్ కూడా నివాళి అర్పించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చిన్నారి మీరా ఆత్మహత్యకు చింతిస్తున్నట్టు సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న Leo మూవీ మేకర్స్ తెలిపారు. విజయ్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 
ఈ బాధాకర సమయంలో తమ సినిమా నుంచి ఈరోజు రావాల్సిన పోస్టర్ విడుదలను వాయిదా వేసినట్టు ట్వీటర్ వేదికన వెల్లడించారు. రేపు ఆ పోస్టర్ విడుదలవుతుందని తెలిపారు. 

ఇక విజయ్ ఆంటోనీ కూతురుది ఆత్మహత్యేనని పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా అధికారులు ధృవీకరించారు. రేపు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక విజయ్ ఆంటోనీ ఇంట్లో భరించలేని విషాద ఘటన జరగడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా చింతిస్తున్నారు. విజయ్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చిన్నారి ఆత్మకు శాంతికి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

ఇదిలా ఉంటే... విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలో ‘మాస్టర్’ తర్వాత ‘లియో’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి భారీ హిట్ చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. త్రిష హీరోయిన్. ముఖ్య పాత్రలో శ్రియా రెడ్డి, హిమ్రాన్ హస్మిన్ తదితరభారీ తారాగణం నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Scroll to load tweet…