Asianet News TeluguAsianet News Telugu

Leo : లియో ‘టైటిల్’ ఇష్యూ.. ఎన్ని లక్షలకు సెటిల్ చేశారంటే?

కోలీవుడ్ చిత్రం ‘లియో’ రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. టైటిల్ విషయంలో సమస్య వచ్చింది. తాజాగా ఆ ఇష్యూను సెటిల్ చేశారని తెలుస్తోంది. అందుకు ఎంత ఖర్చు చేశారంటే...
 

Leo Movie Title Issue Settled for Telugu Release? NSK
Author
First Published Oct 17, 2023, 10:55 PM IST | Last Updated Oct 17, 2023, 10:55 PM IST

తమిళ స్టార్ దళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘లియో’ (Leo). రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ను తెలుగులో మరొకకు రిజిస్టర్ చేయించుకోవడంతో రిలీజ్ కు అడ్డంకిగా మారింది. తెలుగులో ‘లియో’ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. దీంతో టైటిల్ వివాదంపై ఇవ్వాళ స్పందించారు. 

తమకు తెలియకుండానే రిజిస్టర్ చేయించుకున్న వారు కోర్టును ఆశ్రయించారన్నారు. ఎలాగైన రిలీజ్ కు అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ఇష్యూ సెటిల్ అయినట్టు తెలుస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న వారికి 25లక్షల వరకు చెల్లించి టైటిల్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవనే చెప్పాలి. 

ఇక సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ వారు ‘లియో’ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ లోకీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్ ను రూ.16 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 19న అన్నీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విజయ్‌, త్రిష జంటగా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ నెగటివ్‌ రోల్స్ లో అలరించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios