Asianet News TeluguAsianet News Telugu

‘డియర్‌ కామ్రేడ్‌’కు లెంగ్తీ రన్ టైమ్

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. 

Lengthy runtime locked for Dear Comrade
Author
Hyderabad, First Published Jul 20, 2019, 10:17 AM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాష‌ల్లోనూ జులై 26నే విడుద‌ల కానుంది డియ‌ర్ కామ్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది.  UA సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ చిత్రం కు లెంగ్తీ రన్ టైమ్ ఉందని సమాచారం.

169  నిముషాల (2 గంటల 49 నిముషాలు)కు సినిమా రన్ టైమ్ లాక్ చేసారని సమాచారం. అయితే ఈ రన్ టైమ్ లెంగ్త్ అనిపిస్తుందా అంటే...విజయ దేవరకొండ సూపర్ హిట్ అర్జున్ రెడ్డి చిత్రం మూడు గంటలు ఉండటంతో ఎంగేజ్ చేయగలిగితే సమస్య ఉండదంటున్నారు.

డియర్ కామ్రేడ్ సినిమా ఒకే కాలేజీలో చదువుతున్న  ఓ కాలేజ్ స్టూడెంట్ కు, ఓ మహిళా క్రికిటర్ కు మధ్య జరిగే ప్రేమ కథగా చెప్తున్నారు. కాకినాడ టౌన్ లో జరిగే ఈ కథకు టెర్రిఫిక్ సౌండ్ ట్రాక్ పడిందని , సినిమా సూపర్ గా వచ్చిందని చెప్తున్నారు. 

 ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తానంటూ ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios