తెలుగు సినిమాకు పాలకొల్లు అందించిన ఆణిముత్యం

తెలుగు సినిమాకు పాలకొల్లు అందించిన ఆణి ముత్యం అల్లు రామలింగయ్య(అక్టోబర్ 1, 1922- జూలై 31, 2004). అనుకరించే విద్యలో అరితేరి నాటకాల్లోకి వచ్చిపడ్డారు అల్లురామలింగయ్య. అల్లు రామలింగయ్య నాటకాలు చూసిన ప్రజానాట్యమండలి గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’తో ఆయనను సినిమాల్లోకి తెచ్చారు.

రేలంగి తరువాత  ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న హాస్యనటుడుడాయనే. స్వాతంత్య్ర పోరాటంలో కూడా ఆయన  పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.  ‘పుట్టిల్లు’ తర్వాత హెచ్.ఎమ్.రెడ్డి గారి ‘వద్దంటే డబ్బు’లో నటించారు. సినిమాలలో నిలదొక్కుకునేందుకు నాటి చాలా మందినటుల్లాగానే అల్లు రామలింగయ్య కూడా బాగా కష్టపడ్డారు. అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, దొంగరాముడు, మూగమనసులు లాంటి సినిమాలు ఆయన్ని హస్యమహానటుడిని చేశాయి. హాస్య నటుల్లో అల్లు విశిష్టమయిన వాడు. కామెడీ వేషాలతో మొదలుపెట్టిన  కామెడీ-విలనీ లో కూది దిట్ట అనిపించుకున్నాడు. విలన్ పక్కన ఆయన ఉంటే తప్ప విలెనీ పూర్తికాదేమో అనేంత పరిస్థితితీసుకువచ్చారు.  సత్యనారాయణ, రావుగోపాలరావులను అల్లురామలింగయ్య లేకుండా ఉహించగలమా!

1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు రామలింగయ్య. 1116 చిత్రాల్లో నటించాలనేది ఆయన కోరికట. అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు చెబుతారు.