సినీ రంగాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోన సమయంలోనే పలువురు సినీ ప్రముఖులు అనారోగ్య కారణలతో మృతి చెందగా, కరోనా కారణంగా కూడా ఇండస్ట్రీలో వరుస మరణాలు సంబవిస్తున్నాయి. ముఖ్యంగా లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనా బారిన పడిన ఆయన రెండో సోదరుడు ఇషాన్‌ ఖాన్‌ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందిస్తున్న వైధ్యుడు జలీల్‌ పార్కర్ ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితమే దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లాం ఖాన్‌ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెలలో దిలీప్‌ కుమార్ ఇద్దరు సోదరులకు కరోనా సోకటంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స  అందిస్తున్నారు. ఇద్దరి వయసు ఎక్కువ కావటంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో గత నలె 21న దిలీప్‌ కుమార్ చిన్న తమ్ముడు అస్లాం ఖాన్ మరణించాడు.

తాజాగా పెద్ద తమ్ముడు ఇషాన్‌ ఖాన్‌ కూడా తుది శ్వాస విడవటంతో దిలీప్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దేశంలో మొత్తం మీద మహరాష్ట్రలోనే కరోన ఉదృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముంబై నగరంలో రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రముఖ ఇళ్లలోనూ కరోన కలకలం సృష్టించిన వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి.