Asianet News TeluguAsianet News Telugu

'లెజెండ్' శరవణన్ హీరోగా మరో చిత్రం... ఈసారి ఎన్ని కోట్లు పెడతాడో?

లెజెండ్ ఫేమ్ అరుళ్ శరవణన్ మరో మూవీకి సిద్ధం అవుతున్నారట. యాక్షన్ రొమాంటిక్ జోనర్ లో ఆయన రెండవ చిత్రం ఉండనుందట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందుతుంది.

legend hero arul saravanan readying for another movie
Author
First Published Sep 17, 2022, 11:01 AM IST

వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ కి 50 ఏళ్ల వయసులో హీరో కావాలనే బుద్ధి పుట్టింది. మనసులో కోరిక కలిగిందే తడవుగా ఆచరణలో పెట్టేశాడు. అలాగే ఏదో మొక్కుబడిగా సినిమా చేయకుండా భారీ లెవెల్ లో ప్లాన్ చేశాడు. లెజెండ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ నిర్మించాడు. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో రిచ్ గా లెజెండ్ మూవీ తెరకెక్కింది. హీరోయిన్ గా నటించిన ఊర్వశి రతేలాకు రెమ్యూనరేషన్ రెండు కోట్ల రూపాయలకు పైనే ఇచ్చారట. 

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నత నిర్మాణ విలువలతో లెజెండ్ మూవీ తెరకెక్కించారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లెజెండ్ చిత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ లో పదో వంతు కూడా లెజెండ్ వసూలు చేయలేకపోయింది. లెజెండ్ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. వేల కోట్ల ఆస్తి కలిగిన అరుళ్ తన సొంత బ్యానర్ లో నిర్మించి విడుదల చేశారు. 

లెజెండ్ మూవీతో వచ్చిన నష్టం మొత్తం ఆయనే భరించారు. ఏదో ముచ్చట తీర్చుకోవడానికి ఒక సినిమా చేశాడని అందరూ అనుకున్నారు. వ్యవహారం చూస్తే సినిమాను సీరియస్ కెరీర్ గా తీసుకున్నాడు అనిపిస్తుంది . అరుళ్ మరో మూవీకి సిద్ధం అవుతున్నారు. అరుళ్ కొత్త మూవీ ప్రకటన త్వరలో రాబోతుందట. కోలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అరుళ్ కొత్త మూవీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు ఆయన వెల్లడించాడు. దీంతో ఈ చిత్రానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయనున్నాడో అని కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 
   

Follow Us:
Download App:
  • android
  • ios