ఆ సూపర్ స్టార్లు ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి.. మంత్రి వ్యాఖ్యలు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 4, Sep 2018, 3:51 PM IST
Learn from Prabhas, Kerala minister slams Malayalam superstars
Highlights

ఇటీవల కేరళలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చాలా మంది మరణించగా, మరికొందరు నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకోవడం కోసం కేరళ సీఎం పిలుపునివ్వడంతో కొన్ని కోట్ల రూపాయల నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చాయి.

ఇటీవల కేరళలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చాలా మంది మరణించగా, మరికొందరు నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకోవడం కోసం కేరళ సీఎం పిలుపునివ్వడంతో కొన్ని కోట్ల రూపాయల నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చాయి. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న దిగ్గజాలతో పాటు సామాన్యులు సైతం తమవంతు సహాయాన్ని అందించారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమ హీరోలు విరాళాలు తక్కువ అందజేశారనే విమర్శ ఉంది. ఈ విషయంపై తాజాగా కేరళ టూరిజమ్ శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. సినిమాకు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ చొప్పున తీసుకునే హీరోలు విరాళాలు ఇవ్వాల్సి వస్తే మాత్రం లక్షల్లో ఇచ్చారు.

ప్రభాస్ కి మలయాళంలో పెద్ద మార్కెట్ లేదు. కానీ ఆయన కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. మలయాళ సూపర్ స్టార్లు ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేరళ మంత్రి ప్రభాస్ ని బహిరంగంగా పొగడడంతో ఆయన అభిమానులు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చినా.. ప్రచారం చేసుకోలేదంటూ తమ హీరో గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. 

loader