‘అన్ స్టాపబుల్’లీక్ : బాలయ్య ఆ ప్రశ్న, అదిరిపోయే పవన్ సమాధానం,ఇదొక్కటి చాలు
త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ ఎపిసోడ్ కి ఎలాగో రికార్డ్స్ వస్తాయి అని అంచనా వేస్తున్నారు. ఆ ఎపిసోడ్ నుంచి ఓ ప్రశ్న, జవాబు...

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పై బజ్ మామూలుగా లేదు. పవన్ తో ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షో షూటింగ్ ముగిసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఏమి అడిగి ఉంటారు...పవన్ ఏమి సమాధానులు ఇచ్చి ఉంటారనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ ఎపిసోడ్ నుంచి చిన్న బిట్ లీక్ అయ్యింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేమిటంటే...
అన్నయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు.. బాలయ్య ప్రశ్నించారు
..
అందుకు పవన్ కళ్యాణ్ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు. అది ఆయన మనస్సులోంచి వచ్చింది. అదేమిటంటే...
'కష్టపడే స్వభావం నేర్చుకున్నా....'
ఈ సమాధానం విన్నాక..పవన్ కళ్యాణ్ పై అప్పటిదాకా ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. ఓప్రక్కన సినిమాలు, సమాజ సేవ, రాజకీయాలు అన్ని ఒంటి చేత్తో లాక్కు రావటం అంటే మాటలు కాదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరూ కొట్టలేరనేది నిజం.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’లేటెస్ట్ సీజన్ లో యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇటీవల హాజరయ్యారు..వారిలో ఒకరు ప్రభాస్ కాగా , మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ని ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. రెస్పాన్స్ ఓ రేంజ్ లో అదిరిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపించింది. అది నిజమైంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన లేదు. ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు అయిన్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ వచ్చారా లేదా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ ని ప్రదర్శించడానికి చూస్తున్నారని వినికిడి. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ షో ని చూడడానికి థియేటర్స్ కి వస్తారని అంచనా వేస్తున్నారు దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.