సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకునే బ్యూటీ లక్ష్మి రాయ్. మూడు పదుల వయసు దాటినా కూడా రత్తాలు అందంతో తోటి హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. అయితే బేబీ బ్యాడ్ లక్కేమిటో గాని ఎన్ని సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా క్లిక్కవ్వడం లేదు. స్టార్ హీరోలతో నటించింది కూడా లేదు. 

లక్ష్మి రాయ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లవుతోంది. ఇక స్పెషల్ రోల్స్ ఐటెమ్ సాంగ్స్ అంటూ కెరీర్ ని ఒక ట్రాక్ లో నెట్టుకొస్తోంది. అయితే బేబీకి ఆ అవకాశాలు దక్కడానికి ప్రధాన కారణం ఇలా హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో దర్శనమివ్వడమే. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా బికినీ లుక్ లో ఒక్క స్టిల్ ఇచ్చినా వెంటనే బేబీకి అవకాశాలు దక్కుతున్నాయి. 

ఇక సినిమాల విషయానికి వస్తే లక్ష్మి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో అవకాశాలు వస్తున్నప్పటికీ కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటానని చెబుతోంది. తమిళ్ సినిమాలతో పాటు  మలయాళం కన్నడ సినిమాలు కూడా చేస్తోంది. 2017లో బాలీవుడ్ లో జూలీ 2 సినిమాను రిలీజ్ చేసి నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.