అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. హీరో విశ్వక్‌సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా మే6న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్‌ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.


 టాలీవుడ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కు పెద్ద షాక్‌ తగిలింది. తన సినిమా ప్రమోషన్స్‌ కోసం నిన్న విశ్వక్‌ సేన్‌ ఓ ఫ్రాంక్‌ వీడియో చేశారు. అయితే…వీడియో న్యూసెన్స్‌ ను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే.. ప్రమోషన్స్ పేరిట ఈ ఫ్రాంక్ వీడియో న్యూసెన్స్ చేస్తున్న ఘటనపై హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే...

యంగ్ హీరో విశ్వక్ సేన్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. నిన్న పెట్రోల్‌ డబ్బాతో అభిమానిని సూసైడ్‌ చేసుకునేలా ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. 

అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. హీరో విశ్వక్‌సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా మే6న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్‌ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

విశ్వక్‌సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళ్తుంటే ఓ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌సేన్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా అంటూ విశ్వక్ కారుకు అడ్డు పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

విష్వక్సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నారు. ఖమ్మం .. లేక్ వ్యూ క్లబ్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. 

ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనేది ఎనౌన్స్ చేయనున్నారు. పెళ్లి చూపుల చుట్టూ తిరిగే కథ ఇది. దాదాపు గ్రామీణ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన హీరోయిన్ గా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. ఇంతవరకూ విష్వక్సేన్ మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేసిన సినిమా ఇది.