రాఘవ లారెన్స్ రూపొందించిన 'కాంచన' సిరీస్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంచన 2 చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి లారెన్స్ ని డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.

అయితే తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ లారెన్స్ వారితో కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ చిత్ర నిర్మాతలు కోరడంతో ఇప్పడు లారెన్స్ దర్శకత్వం వహించడానికి అంగీకరించాడని టాక్.

సినిమా మొదలైన కొద్దిరోజులకే లారెన్స్ కి చిత్రబృందంతో విబేధాలు వచ్చాయి. తన ప్రమేయం లేకుండా, అనుమతి తీసుకోకుండా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో 
లారెన్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు అనౌన్స్ చేశారు.

దీంతో చిత్రబృందం ఆయన్ని సంప్రదించి బుజ్జగించిందని, దీంతో ఆయన తిరిగి సెట్ లో జాయిన్ అవ్వడానికి అంగీకరించినట్లు కోలివుడ్ వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.