‘చంద్రముఖి 2’కి లారెన్స్ కి ఎంత ఇచ్చారో తెలిస్తే షాకే
ఈ చిత్రానికి మంచి బడ్జెట్ వెచ్చించి తీసారు. ఈక్రమంలో లారెన్స్ కు రెమ్యునరేషన్ గా ఇచ్చిన ఎమౌంట్ ఎంతనేది తమిళనాట హాట్ టాపిక్ గా నిలిచింది.

రాఘవ లారెన్స్ (Raghava Lawrence), పి.వాసు (P.Vasu) కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’ మొన్న గురువారం (Chandramukhi 2) రిలీజైంది. రజనీకాంత్ - పి.వాసు కాంబోలో వచ్చి అప్పట్లో వచ్చి తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2 Movie) రూపొందింది. అయితే ఈసారి ప్రధాన తారాగణం మారింది. రజనీ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించారు. చంద్రముఖి పాత్రను కంగనా రనౌత్ పోషించింది. అయితే ఈ నయా చంద్రముఖి ఆకట్టుకోలేకపోయి చతికిల పడింది. అయితే ఈ చిత్రానికి మంచి బడ్జెట్ వెచ్చించి తీసారు. ఈక్రమంలో లారెన్స్ కు రెమ్యునరేషన్ గా ఇచ్చిన ఎమౌంట్ ఎంతనేది తమిళనాట హాట్ టాపిక్ గా నిలిచింది.
తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు చంద్రముఖి 2 చిత్రం నిమిత్తం లారెన్స్ భారీ మొత్తమే అందింది. 30 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు నిమిత్తం ఆయనకు ఇచ్చారని తమిళ మీడియా అంటోంది.అయితే అంత పెద్ద మొత్తం మాత్రం ఎవరూ ఊహించలేనిది.
ఈ సీక్వెల్ విషయానికి వస్తే...తొలి ‘చంద్రముఖి’లో లాగే ఓ ఇంట్రడక్షన్ ఫైట్, పాటలతో సినిమా చాలా రొటీన్‌గా మొదలవుతుంది. స్క్రీన్‌ప్లే, క్యారక్టర్ అన్నిటి విషయంలో ‘చంద్రముఖి’ని యాజిటీజ్‌గా ఫాలో అయ్యారు. మొదటి భాగంలో జ్యోతిక పాత్రను చంద్రముఖి ఆత్మ పీడిస్తున్నది అనే భ్రాంతిలో జ్యోతిక ఉందని తెలియడంలో కాస్త థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహిస్తుంది, దాని వల్ల పీడించబోయే యువతి ఎవరన్నది సినిమా ఆరంభంలోనే అర్థమైపోతుంది. స్క్రీన్ ప్లే పరంగా ఈ భాగంలో చేసిన మార్పులేమైనా ఉన్నాయా అంటే మొదటి భాగంలో ఉండే రాజు పాత్ర ఆత్మను తీసుకురావడం, చంద్రముఖి పట్టిన పాత్రను ఇంటర్వల్‌కు పరిచయం చేయడం, ఫ్లాష్‌బ్యాక్‌ను మార్చి నిడివి పెంచడం కేవలం ఇవి మాత్రమే..ఇవన్నీ పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయానేది నిజం.