Asianet News TeluguAsianet News Telugu

'వాల్తేరు వీరయ్య' రూట్ లోనే రెడీ అవుతున్న ఎన్టీఆర్

 బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Lavish Sets Being Readied for NTR30
Author
First Published Feb 5, 2023, 6:33 PM IST


ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో సినిమాను అనౌన్స్  అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు షూట్ కు సిద్దమవుతోంది . మొదట్లో  ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్‌, ఆచార్య‌తో కొర‌టాల శివ బిజీగా ఉండ‌టంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డం ఆల‌స్య‌మైంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక, ఆచార్య రిలీజ్ అవటం... అది ప్లాఫ్ అవటంతో  ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ మొద‌లుకాక‌పోవ‌డంతో అనేక అనుమానాల‌కు తావిచ్చింది. అయ్యితే అలాంటిదేం లేదు మొదలెట్టేస్తున్నాం అంటూ ఎనౌన్సమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంకు సంభందించిన షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేసారు. 

అందుతున్న సమాచారం మేరకు  #ntr30 హైదరాబాద్, గోవా, విశాఖల్లో షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ సినిమా కోసం హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో   చిరంజీవి రీసెంట్ హిట్ వాల్తేర్ వీరయ్య లో మాదిరిగా భారీ పోర్టు సెట్ ని రెడీ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే..నవంబర్ నాటికి సినిమా మొత్తం పూర్తి చేసారని వినికిడి. ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత పాన్ ఇండియ‌న్ స్థాయిలో ఎన్టీఆర్‌కు ఇమేజ్ ఏర్ప‌డింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తోన్న ఎన్టీఆర్ 30 సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

కొరటాల, ఎన్టీఆర్  కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  న్యూ ఇయర్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ 30వ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర టీమ్  ప్రకటించింది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రానికి తమిళ్‌ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు.  

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించాడు ఎన్టీఆర్‌. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు మించిన హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్‌ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ రేంజ్‌లో ఒక హిట్‌ ఎన్టీఆర్‌కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్‌ కొరటాలకి అవసరం. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios