Asianet News TeluguAsianet News Telugu

Miss Perfect Teaser : లావణ్య త్రిపాఠి నుంచి కొత్త సిరీస్.. ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ చూశారా!

మెగా కోడలు, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తననుంచి రాబోయే కొత్త వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. సరికొత్త కథతో టీజర్ ఆకట్టుకుంటోంది. 
 

Lavanya Tripathi Miss Perfect Teaser Out Now NSK
Author
First Published Jan 11, 2024, 2:56 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tej భార్య, నటి లావణ్య త్రిపాఠి Lavanya Tripathi మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. గతేడాది నవంబర్ 3న వీరి వివాహాం ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన జోరు తగ్గడంతో నెక్ట్స్ లైఫ్ పై ఫోకస్ పెట్టారు. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు  కెరీర్ పైనా దృష్టి సారిస్తున్నారు.  ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న లావణ్య త్రిపాఠి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చింది. 

లావణ్య త్రిపాఠి అటు సినిమాలు, ఇటు సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటున్న విషయం చేసింది. ప్రస్తుతం తను ఏ సినిమా చేసినా కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొత్తదనం ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటోంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై బాగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘హ్యాపీ బర్త్ డే’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది.

చివరిగా ‘పులి మేక’ అనే సిరీస్ లోనూ ఆది సాయికుమార్ తో కలిసి నటించింది. ప్రస్తుతం మరో కొత్త వెబ్స సిరీస్ తో అలరించేందుకు సిద్ధమైంది. ‘మిస్ పర్ఫెక్ట్’ Miss Perfect అనే టైటిల్ తో ఈ సిరీస్ రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ తుది దశవరకు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు మేకర్స్ పనులు ప్రారంభించారు. 

ఈ క్రమంలో తాజాగా ‘మిస్ పర్ఫెక్ట్’ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.  స్కైలాబ్‌కు పేరుగాంచిన విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం నిర్మించారు. త్వరలోనే ఇది ఓటీటీలోకి రానుంది. 

సిరీస్ టీజర్‌ను తాజాగా OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆవిష్కరించింది. లావణ్య త్రిపాఠి సరికొత్త పాత్రలో నటించనున్నారు. టీజర్ ప్రకారం.. లావణ్య పరిశుభ్రత పట్ల మక్కువతో పరిపూర్ణత చూపుతోంది. ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తుంటుంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కు వంటలు చేయడమంటే చాలా ఇష్టం. ఇలా వారి ఇష్టాల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేదే ఈ సిరీస్. సిరీస్ లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేష్ విట్టా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios