సెలబ్రెటీలు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు, కామెంట్స్ విషయాల్లో చాలా ఎలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా కులం, మంత, రాజకీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వివాదాల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి అలాంటి ఓ చిత్రమైన వివాదంలో చిక్కుకొన్నారు. కులం పేరుతో చేసిన ట్వీట్ వివాదంగా, హాట్ టాపిక్ గా  మారింది. అయితే  చర్చ జరుగుతుండగానే ఆ వివాదాస్పద ట్వీట్‌ను డిలీట్ చేయడం, అగ్నికు ఆజ్యం పోసినట్లైంది.

వివరాల్లోకి వెళితే...లావణ్య త్రిపాఠి ట్వీట్ ప్రకారం..  "నేను ఓ బ్రాహ్మిణ్ గా, బ్రాహ్మణులు కొందరిలో ఉన్నటువంటి ఆధిక్యులమే అనే ఫీలింగ్ నాకు అర్దం కాదు,మనం గొప్పవాళ్లమా, తక్కువవాళ్లమా అనేది కులాన్ని బట్టి కాదు, మనం చేసే పనులును బట్టి నిర్ధారించాలి." అన్నారు.

ఇలా హఠాత్తుగా ఆమె కామెంట్ చేయటానికి కారణం ...రీసెంట్ గా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా... బ్రహ్మణ కమ్యూనిటిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. పరుశురామ అనే అఖిల భారత బ్రాహ్మణ మహాసభ  కార్యక్రమంలో పాల్గొని ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ... "బ్రాహ్మణులు ఎప్పుడూ సమాజంలో గౌరవనీయమైన స్దానంలో ఉన్నారు. అందుకు కారణం వారు చేసిన త్యాగాలు, వగైరా. అందుకే బ్రాహ్మణ సమాజం సమాజాన్ని గైడ్ చేసే గురు స్దానంలో ఉంది." అని కామెంట్ చేసారు. ఆ పోస్ట్ అనేకమంది విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి సైతం ఆ పోస్ట్ పైనే కామెంట్ చేసిందని, అయితే అనవసర వివాదాలు ఎందుకని డిలేట్ చేసినట్లు తెలుస్తోంది.