ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం రోజు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం రోజు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్నేళ్లు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తన కోస్టార్ లావణ్య త్రిపాఠిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు.
మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం రోజు వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ ఎఫైర్ గురించి అంతగా ఎవరికీ తెలియదు.
కానీ రెండేళ్ల క్రితమే అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి, వరుణ్ ల ప్రేమని పసిగట్టినట్లు ఉన్నారు. చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతుండగా మధ్యలో మైక్ తీసుకున్న అల్లు అరవింద్.. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బావుంటుంది అని అల్లు అరవింద్ చెప్పడంతో.. లావణ్య ఒక్కసారిగా షాక్ అయింది.
ఇక్కడే ఒక కుర్రోడిని చూసుకో అని అల్లు అరవింద్ నోట ఆ మాట ఊరకే రాదు. ఆయన ముందే పసిగట్టారు వీళ్లిద్దరి వ్యవహారాన్ని అని నెటిజన్లు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జల్సా చిత్రంలో ప్రకాష్ రాజ్.. పవన్ తో.. నేను క్యాజువల్ గా అన్నానురా అని అంటే.. పవన్ నేను సీరియస్ గా తీసుకున్నాను అంటాడు. ఆ డైలాగ్ ని ఇప్పుడు అల్లు అరవింద్, లావణ్యకి అన్వయిస్తూ మీమ్స్ చేస్తున్నారు.
లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోయేది టాలీవుడ్ కుర్రాడినే.. అందులోనే తన ఫ్యామిలీకి చెందిన అబ్బాయినే అని అల్లు అరవింద్ కి తెలుసు.. అందుకే ఆ ఆమాట అన్నారని నెటిజన్లు కంఫర్మ్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ తన లవ్ అఫైర్ 2016లోనే మొదలైనట్లు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తర్వాత చేసిన పోస్ట్ లో కంఫర్మ్ చేసింది. 2016 నుంచి ఫరెవర్ అంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ కి లావణ్య క్యాప్షన్ ఇచ్చింది. 2016లో మిస్టర్ మూవీ షూటింగ్ లో వీరిద్దరి మనసులు కలిశాయి. అప్పటి నుంచి రిలేషన్ ని సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ కెరీర్ లో సెటిల్ అయ్యాక ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారు. ఏమైనా వీళ్లిద్దరి ప్లానింగ్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
