చిరంజీవి తన పెళ్లికొస్తాడని `అందాల రాక్షసి` టైమ్‌లోనే చెప్పిన లావణ్య త్రిపాఠి.. ప్లాన్ ప్రకారమే జరిగిందా?
ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో లావణ్య త్రిపాఠి అప్పుడు చెప్పిందే ఇప్పుడు జరిగింది.

లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం మెగా కోడలైంది. ఉపాసన తర్వాత లావణ్య రెండో కోడలుగా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. రెండు రోజుల క్రితం(నవంబర్ 1న) ఇటలీలో చాలా గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతుంది. వీరు గ్రాండియర్ నెస్, డిజైన్స్, లగ్జరీ విషయంలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అంతేకాదు ఖర్చు కూడా షాకిస్తుంది. ఏకంగా పది కోట్లకుపైగానే పెళ్లికి ఖర్చు అయ్యిందని సమాచారం.
అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె తన పెళ్లికి చిరంజీవి వస్తాడని చెప్పింది. ఆ వీడియో క్లిప్ లావణ్య తొలి చిత్రం `అందాల రాక్షసి` చిత్రంలోనిది. అందులో నీ పెళ్లకి సినిమా సెలబ్రిటీలంతా వస్తున్నారటగా అని చిన్న పిల్లాడు అడిగితే తలూపుతుంది. ఆ టైమ్‌లోనే చిరంజీవి కూడా వస్తున్నాడా అని పాప అడగ్గా, అవునని చెబుతుంది లావణ్య. సరిగ్గా పదకొండేళ్ల తర్వాత అదే జరిగింది. ఇంకా చెప్పాలంటే వారి ఫ్యామిలీ లోకే వెళ్లింది.
మధ్యలో ఓ సినిమా ఈవెంట్‌లో నిర్మాత అల్లు అరవింద్ కూడా అదే చెప్పాడు. మంచిగా తెలుగు అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపో అని చెప్పాడు అరవింద్. సరిగ్గా అదే జరిగింది. యాదృశ్చికంగా లావణ్యకి సంబంధించి ఆమె లైఫ్‌లో జరిగేవి, రియల్ లైఫ్‌లో హింట్ ఇస్తూనే ఉన్నాయి. ఈ రెండు ఆద్యంతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా పదకొండేళ్ల క్రితం తన మొదటి సినిమాలోని సీన్‌లోని డైలాగు ఇప్పుడు నిజం కావడం ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ ట్రెండ్ అవుతుంది. చూడ్డానికి ఇదంతా అనుకున్నట్టుగానే జరుగుతుందా? అనేది ఆశ్చర్యపరుస్తుంది.
మెగా ఫ్యామిలీ.. చిరంజీవి, పవన్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఉపసాన, స్నేహారెడ్డి, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్, నితిన్ వంటి వారు అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి చాలా లావిష్‌గా జరిగిన విషయం తెలిసిందే. తాము లవ్ ప్రపోజ్ చేసుకున్న టౌన్‌లోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడం విశేషం.