భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. జవానుల ప్రాణాలను బలికొన్న పాక్ కు సరైన బుద్ధి చెప్పాలని భారత ఆర్మీ తీవ్రంగా కృషిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరణించిన జవానుల కుటుంబాలను ఆదుకునేందుకు సెలబ్రెటీలు ఇంకా ముందుకొస్తున్నారు. 

గాన కోకిల లతా మంగేష్కర్ కూడా తన మంచి మనసుతో భారీ విరాళం ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో దేశ ప్రజలు లతా మంగేష్కర్ ను ప్రశంసిస్తున్నారు. తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారి వర్థంతి సందర్బంగా ఆమె ఈ విరాళంను అందిస్తున్నట్లు చెప్పారు. 

మీ మీద మరింత గౌరవం పెరిగింది మేడమ్ అంటూ మీరు చేసిన సహాయం ఎంతో అమూల్యమైనదని నెటిజన్స్ పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు అలాగే సినీ దర్శకులు వారికి తోచినంత ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ - అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ విరాళాల కోసం అభిమణులను కూడా ఉత్తేజపరిచారు.